Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జాతీయంBreaking News

Aequs: కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ఐపీవో పత్రాలు దాఖలు చేసిన ఈక్వస్..!

Aequs: కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ఐపీవో పత్రాలు దాఖలు చేసిన ఈక్వస్..!

మన సాక్షి:

ఏరోస్పేస్, కన్జూమర్ రంగాలకి ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ సేవలు అందించే ఈక్వస్ లిమిటెడ్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (ఐపీవో) సంబంధించి కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. 2025 జూన్ 3న ఈ మేరకు బహిరంగ ప్రకటన జారీ చేసింది.
సంబంధిత వర్గాలు, గతంలో మీడియా వార్తల ప్రకారం పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ 200 మిలియన్ డాలర్లు సమీకరించే యోచనలో ఉంది.

రెగ్యులేటరీ ఫైలింగ్స్‌ ప్రకారం తాజాగా షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ విధానంలో (ఓఎఫ్ఎస్) షేర్లను విక్రయించడం రూపంలో ఈ ఇష్యూ ఉంటుంది. దీనిపై స్పందించేందుకు కంపెనీ నిరాకరించింది. సంస్థను పబ్లిక్ కంపెనీగా, అలాగే “ఈక్వస్ ప్రైవేట్ లిమిటెడ్” నుంచి పేరును “ఈక్వస్ లిమిటెడ్”గా మార్చేందుకు ఈక్వస్ డైరెక్టర్ల బోర్డు ఇటీవలే ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సంస్థలు ఈ ఐపీవోకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా కార్యకలాపాల విస్తరణ కోసం ఈక్వస్‌లో ప్రమోటర్లు గణనీయంగా ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఎమికస్ క్యాపిటల్, అమాన్సా క్యాపిటల్ స్టెడ్‌వ్యూ క్యాపిటల్, కాటమారన్ (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఫ్యామిలీ ఆఫీస్), స్పార్టా గ్రూప్, దేశ్ దేశ్‌పాండే ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ మొదలైన గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వెస్ట చేశారు.

పీఈ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ. 586 కోట్ల మొత్తాన్ని CCPS రూపంలో సమీకరించింది. 2024 జూలై 5 నాటి కేర్ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక ప్రకారం కార్యకలాపాల విస్తరణకు ఈ నిధులను కంపెనీ వినియోగించుకోనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 988 కోట్లుగా, మొత్తం నిర్వహణ ఆదాయం రూ. 970 కోట్లుగా నమోదైంది. కేపెక్స్ ప్రాజెక్టులు పూర్తయ్యాక, ఏరోస్పేస్ విభాగంలో నిరంతరాయ ఆర్డర్ల ప్రవాహం దన్నుతో కంపెనీ ఆదాయం మధ్యకాలికంగా వార్షిక ప్రాతిపదికన 45 శాతం మేర వృద్ధి చెందుతుందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ అంచనా.

అరవింద్ మెలిగెరి (Aravind Melligeri) ఈ సంస్థకు వ్యవస్థాపక చైర్మన్‌గా ఉన్నారు. ఆయనకు ఏరోస్పేస్ విభాగంలో దశాబ్దాల అనుభవం ఉంది. క్వెస్ట్ గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఆయన సహ వ్యవస్థాపకుడు. కంపెనీ ఇటీవలే తమ ఏరోస్పేస్ విభాగానికి జీన్-మిచెల్ కొండామిన్ (Jean-Michel Condamin)ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకుంది. రాజీవ్ కౌల్ మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.

వివిధ పరిశ్రమలకు చెందిన గ్లోబల్ కస్టమర్లకు సర్వీసులు అందించేందుకు భారత్, ఫ్రాన్స్, అమెరికాలో ఈక్వస్‌కి తయారీ కార్యకలాపాలు ఉన్నాయి. అలాగే కర్ణాటకలో మూడు తయారీ క్లస్టర్లు (బెల్గావి, హుబ్బళ్లి, కొప్పల్) ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం టాటా ఎలక్ట్రానిక్స్, మదర్సన్ గ్రూప్ & జాబిల్‌తో పాటు ఈక్వస్ కూడా యాపిల్ ఉత్పత్తుల కోసం మెకానికల్ విడిభాగాలను తయారు చేస్తోంది.

MOST READ : 

  1. పారస్ హెల్త్‌కేర్‌లో రూ. 170 కోట్లు ఇన్వెస్ట్ చేసిన 360 వన్ అసెట్..!

  2. Fortune: ఫార్చూన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మాస్టర్‌క్లాస్.. టాప్ 25 విజేతలకు అహ్మదాబాద్‌లో సత్కారం..!

  3. Nalgonda : జిల్లా అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

మరిన్ని వార్తలు