Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి.. జిల్లా కలెక్టర్..!

District collector : పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి.. జిల్లా కలెక్టర్..!

సూర్యాపేట, మనసాక్షి :

ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు అధికం అయ్యి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిళ్లుతున్నదని, అట్టి ముప్పు నివారణ భావితరాల శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుటకు గాను విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు ప్రక్కన అమృత్ పధకం ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటేకార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమము ద్వారా మహిళ సంఘాల సభ్యులు మొక్కలు పెంచి వాటిని పరిరక్షణ చేయుట ద్వారా ఉపాధి లభిస్తున్నది అన్నారు. అనంతరం పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు ప్రక్కన గల సీవరేజ్ ట్రిట్ మెంట్ ప్లాంట్ ను సందర్శించి నీటి శుద్ధి చేయు విధానాన్ని పరిశీలించి ఇంజనీర్ లకు తగు సూచనలు చేశారు. అనంతరం మానసానగర్ రోడ్ నెంబరు-4 లోని పూర్తిచేసిన రోడ్డును పరిశీలించారు.

జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించిన పనులను కాంట్రాక్టర్ లు నాణ్యత తో చేయాలి అని అట్టి పనుల ఫై సంబంధిత అధికారులు ఫీల్డ్ ఫై ఉండి పనులు చేయిచాలి అని, ఫైల్ ప్రాసెసింగ్ నియమ నిబంధనల ప్రకారం ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు. సూర్యాపేట పట్టణంలో డీఎం ఎఫ్ టి నిధులతో జరిగిన పనులను పరిశీలించి సంతృప్తి చెందారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి డాక్టర్ పర్స రాంబాబు, మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్, మున్సిపల్ ఇ.ఇ యం.కిరణ్ ,డి ఇ సత్యారావు ,పబ్లిక్ హెల్త్ డిఇ రమాదేవి, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగాండ్ల శ్రీనివాస్, ఎ.ఇనరేందర్, రాజారెడ్డి, తిరుమలయ్య, ఎస్.ఎస్ .ఆర్ .ప్రసాద్ టీఎంసీ శ్వేత మహిళసంఘల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Farmers : రైతులకు భారీ గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరలకు చర్యలు.. బిగ్ అప్డేట్..!

  2. TG News : తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ ల బదిలీ..!

  3. Rythu Bharosa : రైతు భరోసా, రైతు బీమా పై కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  5. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం అడిగిన డాక్టర్ సస్పెండ్..!

మరిన్ని వార్తలు