TOP STORIESBreaking Newsతెలంగాణ
TG News : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త.. వారికి రూ.10 లక్షలు..!
TG News : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త.. వారికి రూ.10 లక్షలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. స్వయం సహాయక మహిళ సంఘాలలో సభ్యురాలు ప్రమాదవశాత్తు మృతి చెందితే పది లక్షల రూపాయల సహాయం ప్రభుత్వం చేయనున్నట్లు వెల్లడించారు.
గత సంవత్సరం చనిపోయిన 385 మంది మహిళలకు 18.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా, రుణబీమా చెల్లింపుల కోసం 70 కోట్ల రూపాయలను చెల్లిస్తూ ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.









