Suryapet : భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. ఆరుగురి అరెస్ట్..!
Suryapet : భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. ఆరుగురి అరెస్ట్..!
సూర్యాపేట, మనసాక్షి :
రైతులకు నకిలీ విత్తనాలు చేరకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుని నిఘా ఉంచి నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఆరుగురిని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ కు పంపడం జరిగిందని జిల్లా ఎస్పి కే నరసింహ అన్నారు. అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, సూర్యాపేట డి.ఎస్.పి ప్రసన్న కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ల తొ కలిసి
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశం లో కేసుల వివరాలను ఎస్పీ నరసింహ వివరించారు.
ఈ సందర్బంగా అయినా మాట్లాడుతూ
మోతే పోలీస్ స్టేషన్ లో ఇద్దరు నిందితులని, ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి సుమారు 65 లక్షల విలువగల 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందాన్నారు.
రైతులు ఎక్కడ కూడా మోసపోవద్దు అనే ఉద్దేశ్యంతో కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం జరిగినది అని తెలిపారు. జిల్లా పోలీసు, వ్యవసాయ శాఖ అధ్వర్యంలో నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తు,ఈ నకిలీ విత్తనాల గురించి క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి అవి రైతులకు సరఫరా జరగకుండా పని చేస్తున్నాము అని అన్నారు.
కేసు వివరాలు :-
సోమవారం ఉదయం సమయంలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధి పాతర్లపాడు బస్ స్టేజి వద్ద సిసిఎస్ పోలీసు మరియు ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం గా ఉన్న వ్యక్తి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కు చెందిన ఏ 2 నిందితుడు తండా నగేష్ అనే నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగినది. ఇతను 120 ప్యాకెట్లు కలిగిన నకిలీ విత్తనాల గోనెసంచిని బండి పై పెట్టుకొని వెళుతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతని విచారించగా ఇతడు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన ఏ 3 నిందితుడు పంది రాముల వద్ద విత్తనాలు తెస్తున్నట్లు ఒప్పుకున్నాడు.
ఈ విత్తనాలు రైతులను మోసం చేసి గడ్డి మందు తట్టుకునేదని, అధిక దిగుబడిని ఇచ్చేవి అని రైతులను మోసం చేస్తున్నట్లు గుర్తించి ఏ 2 తండా నగేష్ ఒప్పుకోలు ప్రకారం ఏ 3 నిందితుడు పంది రాములను అతని గ్రామంలో అదుపులోకి తీసుకోవడం జరిగిన్నారు. ఇతని వద్ద 120 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నాము.
ఏ 3 నిందితునికి ఈ నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ఏ 4 నిందితుడు బానోతు జయరాం అతని స్వగ్రామం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మైలవరం లో విత్తనాల దుకాణం షాప్ ఉన్నదని, దుకాణం వద్దకు గుంటూరు టౌన్ బాలాజీనగర్ కు చెంది ఏ 5 నిందితుడు తరిగొప్పల శ్రీనివాసరావు రగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని,జయరాం షాపులో నిల్వచేసిన 37 బస్తాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ బస్తాలో ఒక్కొక్క దానిలో 120 ప్యాకెట్లు నకిలీ విత్తనాలు కలవు.
ఈ కేసులో స్వాధీనం చేసుకున్న విత్తనాలు సుమారు 63 లక్షలు రూపాయలు. ఈ విత్తనాలు జిల్లా మొత్తంలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు వీరిని అదుపులోకి తీసుకుని విత్తనాలు రైతులకు చేరకుండా చేశామని చెప్పారు.. ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్ కేసులో బాపట్ల జిల్లా ఇంకోలు గ్రామానికి చెందిన ఏ 1 మాగులూరి సాంబశివరావు, కర్నూలు జిల్లా పల్లిపాడుకు చెందిన ఏ 6 చెవుల నరసింహులు పరారీలో ఉన్నారు. ఏ 1 సాంబశివరావు ఎండీ గా వ్యవహరిస్తు అరుణోదయ అనే విత్తన కంపెనీ నిర్వహిస్తున్నాడు, ఈ కంపెనీ నిర్వహిస్తూ నకిలీ విత్తనాల ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించడం జరిగినది. వీరి ఇరువురిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తామని చెప్పారు.
మోతే పీస్ కేసులో..
నమ్మదగిన సమాచారంపై సిసిఎస్ పోలీసులు మరియు మోతే పోలీసులు సంయుక్తంగా రావిపాడు గ్రామంలో ఏ 1 వెలుగు శ్రీను ఇంట్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా అక్కడ అడ్వాన్స్ 333, అరుణోదయ అనే కంపెనీ పేర్లుగల 98 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగినది మోతే పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి నిందితున్నే విచారించగా ఏ 1 కు బంధువు అయినా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఏ 2 చర్లపల్లి శాతవాహన అనే నిందితుని తో కలిసి మోతే మండల పరిసర గ్రామాలలో, జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఈ విత్తనాలు గడ్డి మందును తట్టుకునేవి అని అధిక దిగుబడిన ఇచ్చే మంచి రకం పత్తి విత్తనాలు అని నమ్మించి రైతులకు ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నామని ఒప్పుకున్నాడు.
ఇతని ఒప్పుకోలు ప్రకారం ఏ 2 నిందితున్ని అతని స్వగ్రామం నందు అరెస్టు చేసి 30 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకోవడం జరిగినది. వీరికి ఈ విత్తనాలు సరఫరా చేస్తున్న ఏ 3 నిందితుడు తిరుమల్ కర్ణాటక రాష్ట్రం నలుగునూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగినది ఇతనిని పట్టుకోవడానికి పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈకేసులో రూ.2.లక్షల విలువ 58 కేజీ ల నకిలీ విత్తాలు సీజ్ చేశాము అన్నారు.
పిడి యాక్ట్ నమోదు చేస్తాం
ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతులను మోసం చేసిన వ్యవసాయానికి నష్టం వాటిల్లేలా నకిలీ విత్తనాలు అమ్మిన అలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పి డి యాక్ట్ సైతం నమోదు చేయడం జరుగుతుందన్నారు.. డీలర్లు బాధ్యతగా ఉండాలని రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించాలని వ్యవసాయానికి రైతుకు సహాయం అందించాలని కోరారు. పోలీస్ శాఖ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎవరైనా గ్రామాలలో వచ్చిన నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిసిన వారి సమాచారాన్ని పోలీసువారికి ఇవ్వాలని ఎస్పీ సూచించారు
నకిలీ విత్తనాలు సీజ్ చేసిన కేసులలో బాగా పని చేసిన సిసిఎస్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శివకుమార్ , ఎస్సై హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ లు విద్యాసాగర్ రావు, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, కర్ణాకర్, కానిస్టేబుల్ ఆనంద్, మల్లేష్, సతీష్, శివ కృష్ణ, ప్రభాకర్, మహిళా హోమ్ గార్డ్ మంజుల ఉన్నారు. సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, ఆత్మకూర్ యస్ ఎస్సై శ్రీకాంత్, మోతే ఎస్ఐ యాదవెందర్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.










