Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయం

Plane Crash : విమానం నుంచి నేను దూకలేదు.. నేను ఎలా బ్రతికాను..!

Plane Crash : విమానం నుంచి నేను దూకలేదు.. నేను ఎలా బ్రతికాను..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ సంచలన విషయాలు తెలిపారు. తాను విమానం నుంచి దూకలేదని, ఎలా బ్రతికాను అంటూ విశ్వాస్ ప్రశ్నించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశంలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలలో కూడా ప్రజలను కుదిపేసింది.

విమానం టేక్ ఆఫ్ అవుతుండగా నేరుగా ఆసుపత్రి హాస్టల్ భవనం పైకి దూసుకెళ్లి పెద్ద పేలుడు శబ్దంతో మంటలు, పొగ అరుపులతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ ను కలుసుకొని ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఆ సందర్భంలో రమేష్ విశ్వాస్ తన కళ్ళ ముందు జరిగిన ఘోర ప్రమాదాన్ని వివరించాడు. విమానం టేక్ ఆఫ్ వేళ వేగం పొంజుకోవడం ప్రారంభించిన వెంటనే తనకి ఏదో వింతగా అనిపించిందని చెప్పాడు. ఆకస్మాత్తుగా 10 సెక్షన్ల లోపే ఆగిపోయింది. నిశ్శబ్దం, ఆపై ఆకుపచ్చ, ఎరుపు లైట్లు వెలిగాయి. పైలెట్ టేక్ ఆఫ్ కోసం తన వంతు కృషి చేసినట్లు చెప్పాడు. అదే వేగంతో హాస్టల్ భవనం పైకి దూసుకెళ్లిందని తెలిపాడు.

అయితే తాను కూసున్న విమానం సీటు ఉన్న భాగం భవనం కింది భాగాన్ని ఢీ కొట్టింది. పైభాగం మంటల్లో చిక్కుకుంది. బహుశా నేను సీటుతో పాటు ఎగిరి బయటపడి పోయాను. తలుపు విరిగిపోయింది. ముందు కొంత ఖాళీ స్థలం కనిపించింది కాబట్టి నేను బయటకు రావడానికి ప్రయత్నించాను. బహుశా అక్కడ ఎవరు బయటకు రాలేకపోయారు.

రమేష్ విశ్వాస్ అజయ్ ఇద్దరు సోదరులు వారు యూకే లో నివసిస్తున్నారు. ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నారు. విశ్వాస్ మరో సోదరుడు మాట్లాడుతూ మేము విశ్వాసుతో మాట్లాడాము. అతను ప్రస్తుతం బాగానే ఉన్నాడని చెప్పారు.

MOST READ NEWS :

  1. Gold Price : ఆల్ టైం రికార్డ్.. ఇక గోల్డ్ కొనలేము..!

  2. Gold Price : వామ్మో.. ఒక్కసారిగా కొండెక్కిన బంగారం.. కొనడం ఇగ కష్టమే..!

  3. TG News : ముగ్గురు మంత్రులు అవుట్.. వారి స్థానంలో మరో ముగ్గురు..!

  4. Schools : తెలంగాణలో స్కూళ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తాజా ఉత్తర్వులు జారీ..!

  5. Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు