Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా
Suicide : కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య..!
Suicide : కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య..!
మన సాక్షి :
తెలంగాణలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది. ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య నివాసంలో పనిచేసే రవి (38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎమ్మెల్యే ఇంట్లోనే పెంట్ హౌస్ లో రవి నివాసం ఉంటున్నాడు.
ఈ సంఘటన యాదగిరిగుట్ట లోని నివాసంలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం రవి స్వగ్రామానికి వెళ్లి శుక్రవారం వచ్చాడు. రవికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.









