Nalgonda : వీడు మామూలోడు కాదు.. బంగారం పేరుతో ఘరానా మోసం..!
Nalgonda : వీడు మామూలోడు కాదు.. బంగారం పేరుతో ఘరానా మోసం..!
నల్లగొండ, మన సాక్షి :
తక్కువ ధరకే బంగారు బిస్కెట్ ఇస్తామని నకిలీ బంగారం అంటగట్టి మోసం చేసి ఐదు లక్షల నగదు కొట్టేసిన అంతరాష్ట్ర నిందితుడునీ పోలీసులు అరెస్టు చేసినట్లు డిఎస్పి శివరాం రెడ్డి తెలిపారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో మాట్లాడుతూ నల్లగొండ వన్ టౌన్ పట్టణ పరిధిలోని దేవరకొండ రోడ్ లో గల అనస్వి మెడికల్ షాప్ యజమాని అయిన వేముల రాజు, తేదీ గత సంవత్సరం నవంబర్ నెల లో సాయంత్రం సమయంలో షాపులో ఉండగా, ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మరొక మహిళతో కలిసి వచ్చి మందులు కావాలని అడుగుతూ “నా పేరు రవి, మాది ఒంగోలు జిల్లా, ఇక్కడ బిల్డర్ గా పనిచేస్తున్నాను.
నా దగ్గర కొంత పురాతన బంగారం ఉంది, దానిని నీకు తక్కువ ధరకి ఇస్తాను” అని చెబుతూ ఒక బంగారు బిళ్ళని తెచ్చి చూపించాడు. దానిలో ఒక ముక్క తీసి పరీక్షించుకోమనగా, జువెలర్స్ షాప్ కు వెళ్లి చెక్ చేయించగా ఒరిజినల్ బంగారం అని తెలిసింది. “రెండు రోజులు సమయం ఇస్తాను, ఐదు లక్షలు సర్దితే 22 తులాల బంగారం బిస్కెట్ ఇస్తానని” చెప్పినాడు. దీనికి సరే అని ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ బిస్కెట్ తీసుకొని మళ్లీ జువెలరీ షాప్ లో చెక్ చేయించుకున్నప్పుడు నకిలీ అని తెలిసింది.
దీనితో మోసపోయానని గ్రహించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టడం జరిగిందni డిఎస్పి తెలిపారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశానుసారం, నల్గొండ డి.ఎస్.పి శ్రీ కె శివరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో, సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి వన్టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎస్సైతో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు డీఈఓ ఆఫీస్ వద్ద సోమవారం నిందితుడిని పట్టుబడినప్పుడు విచారించారు.
తన పేరు బత్తుల యేసు, వడ్డెర కాలనీ, పెద్ద కాకాని, గుంటూరు జిల్లా అని, ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటు పడి, బాగా అప్పులు చేసి, ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి, బంగారం తక్కువ రేటుకు అమ్ముతానని నమ్మించి, మభ్యపెట్టి డబ్బులు కాజేసి పారిపోవాలని నిర్ణయించుకొని వివిధ ప్రదేశాలలో నేరాలు చేయడం ప్రారంభించాడు.
గతంలో కుషాయిగూడ, నల్గొండలో ఇలా నేరాలు చేయగా, కేసులై జైలుకు వెళ్లి రావడం జరిగింది. ఈ క్రమంలో తిరిగి ప్రవర్తన మార్చుకోకుండా, 2024 నవంబర్ నెలలో నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో మెడికల్ షాప్ యజమానిని మోసం చేసి, తనతో పాటు తనకి తెలిసిన వ్యక్తి లక్ష్మి . గుంటూరు (పరారీలో ఉన్నది) తో కలిసి ఐదు లక్షలు కొట్టేసి పారిపోయాడు. ఈరోజు పట్టుబడి చేయగా నిందితుడు చేసిన నేరం ఒప్పుకొనగా, అతని నుండి నాలుగు లక్షల నగదు, అర గ్రాము బంగారం, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని జైలుకు పంపనైనది.
రెండవ కేసు :
బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తే అదే బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతానని జువెలరీ షాప్ వ్యక్తిని నమ్మించి 1,20,000 నగదు కొట్టేసిన అంతరాష్ట్ర నిందితుడు.తేదీ 13.06.2025న నల్గొండ వన్ టౌన్ పరిధిలోని పాతబస్తీలో గల జువెలరీ షాప్ నిర్వహిస్తున్న చేపూరి గోపి కిషన్ ఫిర్యాదు మేరకు, తేదీ 11.06.2005న ఒక వ్యక్తి ఫోన్ చేసి తన వద్దకు వచ్చి “బంగారం బ్యాంకు తాకట్టులో ఉంది.
మీరు డబ్బులు కట్టి విడిపిస్తే ఆ బంగారం తక్కువ ధరకు మీకు అమ్ముతాను” అని ప్రకాశం బజార్లోని యాక్సిస్ బ్యాంకులో 1,20,000 అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. బంగారం గురించి అడిగితే, “ఎకౌంటు ఫ్రీజ్ అయిందని, తర్వాత డబ్బులు ఇస్తానని” మాయమాటలు చెప్పగా, మోసపోయానని దరఖాస్తు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డి.ఎస్.పి తెలిపారు.
ఈ క్రమంలో అతనిని పట్టుబడి చేసి, అతని గురించి విచారించగా వివరాలు: పల్లె మధుకర్ రెడ్డి, పోచంపల్లి, మానకొండూరు మండలం, కళ్లెదా, కరీంనగర్ జిల్లా. మధుకర్ రెడ్డి గతంలో హైదరాబాదులోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో స్టాక్ మార్కెట్ కి సంబంధించి సేల్స్ మేనేజర్ గా పనిచేసి, 2023లో జాబ్ మానేసి, జల్సాలకు అలవాటు పడి, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోయి, ఎలాగైనా ఈజీగా డబ్బులు సంపాదించాలని బ్యాంకులో ఉన్న బంగారాన్ని డబ్బులు ఇస్తే విడిపించి తక్కువ ధరకు అమ్ముతానని మాయ మాటలు చెప్పి డబ్బులు ఎకౌంట్లో వేయించుకొని తప్పించుకొని జల్సా చేస్తుండేవాడు.
మాయమాటలు చెప్పి ఇలా మోసం చేయగా మోసపోయిన వ్యక్తులు అతనిపై ఘట్కేసర్ జూబ్లీహిల్స్ ) మిర్యాలగూడ నిజామాబాద్ వన్ టౌన్ లో కేసు పెట్టగా, సెటిల్మెంట్ చేసుకొని, అరెస్టు అయి బెయిల్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ప్రవర్తన మార్చుకోకుండా, ఇటీవల తిరిగి విశాఖపట్నంలో
సిద్ధిపేట ) ఉప్పల్ ) నల్గొండ వన్ టౌన్ లో మాయమాటలు చెప్పి లక్ష రూపాయల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు మోసం చేసే వాడు.
ఇతని వద్ద నుండి రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని, జుడీష్యల్ రిమాండ్కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు.
నల్గొండ జిల్లా ప్రజలకు పోలీసు వారి మనవి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా కానీ నేరుగా గాని సంప్రదించి, బంగారం తక్కువ ధరకు అమ్ముతానని మాయమాటలు చెబితే, ఎట్టి పరిస్థితులలో నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు.
ఇలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, 100కి గాని సంబంధిత పోలీస్ స్టేషన్ గాని సమాచారం అందించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం రేటు అధికంగా ఉన్నందున ప్రజలు, జ్యువెలరీ షాప్ యజమానులు జరిగే మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.
ఈ రెండు కేసులను డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో,సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వన్ టౌన్ రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో, ఎస్ఐలు శివ, సైదులు, శంకర్, సిబ్బంది రబ్బాని, శ్రీకాంత్, షకీల్ తదితరులను ప్రతిభ కనబరిచినందుకు గాను జిల్లా ఎస్పీ అభినందించారు.
MOST READ :
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆసుపత్రుల పర్యవేక్షణకు త్వరలో యాప్..!
-
Nalgonda : నల్గొండ లో.. పుష్ప ఫేమ్ జగదీష్..!
-
District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. రైతు నేస్తం వీక్షించాలి..!
-
Shankarpalli : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. పార్కింగ్ చేసిన బైకులే వీరి టార్గెట్..!
-
District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. రైతు నేస్తం వీక్షించాలి..!









