Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

District SP : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. కోరుట్ల సర్కిల్ ఆఫీస్ లో ఆకస్మిక తనిఖీ..!

District SP : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. కోరుట్ల సర్కిల్ ఆఫీస్ లో ఆకస్మిక తనిఖీ..!

జగిత్యాల, (మన సాక్షి):

వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా జిల్లా ఎస్పీ సందర్శించి రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేశారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్ , క్రైం రికార్డు, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్ లను పరిశీలించారు.

సర్కిల్ పరిదిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసులలో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్, ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. గ్రేవ్ కేసులలో ఫోక్సో కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు.

ఎస్ వోపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని, 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ చేయాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఆయా ఎస్సై ల ద్వారా చర్యలు తీసుకోవాలని సురేష్ బాబుకి సూచించారు.

తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలనీ సూచించారు. సర్కిల్ పరిదిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు.

కమ్యూనిటీ పొలిసింగ్ లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు సైబర్ నేరాలు వివిధ సామాజిక అంశాలపై ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా సి సి కెమెరాల ప్రాముఖ్యత గురించి గ్రామాల్లో తెలియజేస్తూ ప్రతి గ్రామoలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా కోరుట్ల సర్కిల్ ఆవరణలో ఎస్పీ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డిఎస్పీ రాములు ,డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల సి .ఐ సురేష్ బాబు, ఎస్సై లు శ్రీకాంత్ శ్యామ్ రాజ్, నవీన్, రామచంద్రం, సుప్రియ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Obesity : ఉబకాయం సమస్యకు ఇక చెక్.. చికిత్సలో నూతన ఆవిష్కరణలు..!

  2. Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Youth: అప్పు చేసి పప్పు కూడు కు స్వస్తి.. వ్యక్తిగత రుణాలపై ఆసక్తి తగ్గుదల..!

  4. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!

  5. Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు