తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

Rythu : ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి.. కేంద్ర పథకాలకు ఇకపై అదే ప్రామాణికం..!

Rythu : ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి.. కేంద్ర పథకాలకు ఇకపై అదే ప్రామాణికం..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టిలో ఎరువుల దుకాణాన్ని నారాయణఖేడ్ డివిజన్ సాయ వ్యవసాయ సంచాలకులు కె. నూతన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువులు అమ్మకాలు నిల్వ తదితర రికార్డులను పరిశీలించారు.

ఎరువులను ప్రభుత్వ ధరలకు విక్రయించాలని, రసీదులను కొనుగోలుదారులకు ఇవ్వాలని, ఈపీఓఎస్ ద్వారా ( బయోమెట్రిక్ ) విధానంలో ఎరువులు అమ్మకాలు జరపాలన్నారు. ఎరువులు తీసుకునే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకొని ఎరువులు కొని వెళ్లాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ షాప్ యజమానులు ఉన్నారు.

కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రమాణికం 

ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేస్తున్న ప్రక్రియను ఏడిఏ నూతన్ కుమార్ పరిశీలించారు.కంగ్టి మండల కేంద్రంలో ఏఈవో స్వాతి ఆధ్వర్యంలో రైతులకు గుర్తింపు కార్డు గురించి వివరించి రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రతి రైతు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు భూయజమాన్య పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తో క్లస్టర్ పరిధిలోని ఏఈవోల ఫార్మర్ ఐడి నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఏఈవో తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!

  2. CM Revanth Reddy : దేవుడినైనా ఎదిరిస్తా.. తెలంగాణ ప్రజల తరపున నిలబడతా..!

  3. Fish Venkat : ఫిష్ వెంకట్ కు అండగా జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ..!

  5. ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. లంచం తీసుకుంటూ దొరికిన టాక్స్ అధికారిని..!

మరిన్ని వార్తలు