Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

కరెంట్​ షాక్​తో రైతు మృతి..!

కరెంట్​ షాక్​తో రైతు మృతి..!

భీంగల్, మన సాక్షి :

పొలంలో గడ్డి కోసే మిషిన్ తో గడ్డి కోస్తుండగా ఒడ్డుపై ఉన్న మోటార్ విద్యుత్​ తీగలకు మిషిన్ తాకి కరెంట్​ షాక్​తో రైతు మృతి చెందిన ఘటన భీంగల్ మండలంలో చోటు చేసుకుంది. భీంగల్ ఎస్సై సందీప్​ తెలిపిన వివరాల ప్రకారం.. ​మండలంలోని రహత్ నగర్ గ్రామానికి చెందిన రైతు ధరావత్ రామ్ సింగ్(50) రోజూ మాదిరిగానే శుక్రవారం తన పొలంలో పనులు చేసేందుకు వెళ్లాడు.

కాగా.. పొలంలో ఒడ్డు వెంట గడ్డి కోసే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్​ తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. పక్కనే పొలం దున్నుతున్న మరో రైతు గమనించి దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికి మృతి చెంది ఉన్నాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తమ ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

MOST READ : 

  1. Suryapet : ఎరువుల డీలర్లకు వ్యవసాయ అధికారి సీరియస్ వార్నింగ్.. అలా చేస్తే లైసెన్స్ రద్దు..!

  2. Musi : మూసీ నదికి భారీ వరద.. రిజర్వాయర్ గేట్లు ఎత్తిన అధికారులు..!

  3. PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

  4. SBI Life: లాభాల సునామీ, అగ్రస్థానంలో కొనసాగింపు.. సత్తా చాటిన SBI లైఫ్..!

మరిన్ని వార్తలు