Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Khammam : గిరిజన పాఠశాలలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత..!

Khammam : గిరిజన పాఠశాలలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత..!

కల్లూరు, (మన సాక్షి)

ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ పరిధిలోగల గిరిజన ఆశ్రమ బాలికల హైస్కూల్ నందు సోమవారం 30 మందికి పైగా విద్యార్థునులకు తీవ్ర ఆయాసం వాంతుల తో అవస్థకు గురి కాగా వారిని ప్రభుత్వం హాస్పిటల్ కి తరిలించగా వైద్య అధికారులు డాక్టర్ రమేష్,నవ్యకాంత్ లు వైద్య పరీక్షలు నిర్వహించి పుడ్ పాయిజన్ అయ్యింది అని నిర్ధారించి విద్యార్థులకు మెరుగైన వైద్య అందించాలని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి చికిత్స అందింస్తున్నారు.

చరవాణి ద్వారా విష్యం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ మండల నాయకులకు విద్యార్థినిలను సురక్షితంగా రక్షించాలని ఆదేశించారు.
రెండు ప్రభుత్వం అంబులెన్స్ లతో పాటుగా జిల్లా కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్ రావు,
వ్యవసాయం మార్కెట్ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యం బాబు,మండల యూత్ కాంగ్రెస్ నాయకులు అల్లాకుంట నరసింహారావు వంటి ముఖ్య నేతలు రంగంలోకి బృందాలుగా ఏర్పడి బాగం ప్రభాకర్ చౌదరి,తురాబ్ ఆలి,ఉబ్బన రాంబాబు, గుమ్మడిదల ప్రవీణ్,బొల్లం ఉపేంద్రల పలువురు సహాయంతో తమ సొంత కార్లు లలో గిరిజన హాస్టల్ నుంచి విద్యార్ధులను సమయానికి ప్రభుత్వ దవాఖానాలో చేర్పించి సకాలంలో వైద్య అందిచడానికి కృషి చేసారు.

విష్యం తెలుసుకున్న కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని డాక్టర్ లను ఆరోగ్యం విష్యాలు అడిగి తెలుసుకుని విద్యార్థినీలను పరామర్శించారు. అనంతరం తాసిల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ప్రభుత్వ అధికారులు అక్కడకి చేరుకొని విద్యార్థులకు దైర్యం చెప్పారు.

సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించి అనంతరం ఎస్టీ గిరిజన విద్యార్థినిల హాస్టల్ ని సందర్శించి ఆ స్వస్థతకు కారణం పైన ఆరా తీశారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్ సిబ్బంది పైన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ హామీ ఇచ్చారు.
అనంతరం విద్యార్థినీలతో ప్రత్యేకంగా వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు, త్వరలో గిరిజన ఎస్టి హాస్టల్లో ప్రక్షాళన చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

విద్యార్థినీలకు మెరుగైన చికిత్స అందిస్తున్నాము, మరో ఎనిమిది గంటల్లో విద్యార్ధులను పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని డాక్టర్ రమేష్,నవ్య కాంత్ తెలిపారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు..!

  4. Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

మరిన్ని వార్తలు