Suryapet : ఇతని టార్గెట్ ఫ్రీక్వెన్సీ కేబుల్.. ఏం చేస్తున్నాడంటే..!
Suryapet : ఇతని టార్గెట్ ఫ్రీక్వెన్సీ కేబుల్.. ఏం చేస్తున్నాడంటే..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా నడిగూడెం, మునగాల పోలీస్ స్టేషన్ల పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్లకు సంబంధించింది ఫ్రీక్వెన్సీ కేబులు దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు.
జూన్ మాసంలో నడిగూడెం మునగాల మండల పరిధిలో బిఎస్ఎన్ఎల్ ఫ్రీక్వెన్సీ కేబుల్ వైరు దొంగతనానికి గురైనట్లు సంబంధిత బీఎస్ఎన్ఎల్ అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు . దీనిపై నడిగూడెం మరియు మునగాల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం జరిగిందన్నారు.
దొంగించిన కేబుల్ ను కాల్చి అందులో ఉన్న రాగి తీసి అమ్మి డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నడిగూడెం ,మునగాల పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగినది అలాగే సాంకేతికత ఆధారాలతో నిఘా ఉంచామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా బిఎస్ఎన్ఎల్ టవర్ల వద్ద, ట్రాన్స్ఫార్మర్ల వద్ద, కాలువగట్లపై కొత్త వ్యక్తులు గాని అనుమానాస్పదంగా కానీ సంచరించినట్లయితే పోలీస్ వారికి సమాచారం ఇయ్యాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది కేసు దర్యాప్తులో ఉన్నది.
ఆగస్టు 18న మునగాల పోలీసు స్టేషన్ ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ కు అందిన నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బంది తో కలసి ఆకుపాముల గ్రామం వెళ్ళి అక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కారుతో ఉండగా వారిని అదుపు లోకి తీసుకుని విచారించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం రాజాపూరం కు చేసిన మహంకాళి శ్రీనాధ్, బుడుపుల వంశీ కృష్ణ అని బాలాజీనగర్ నందు ఉంటున్నాము తెలిపారు.
అంతేకాక మాతో పాటు కోదాడ కు చెందిన మరో వ్యక్తి చలిగంటి శ్రావణ్ కుమార్ తో కలసి సుమారు 4 నెలల కాలం లో 9 బిఎస్ఎన్ఎల్ టవర్స్ నిఘా లేనటువంటి వాటిల్లో మునగాల,కోదాడ టౌన్, హాలియా, చిలుకూరు, నేలకొండపల్లి, హుజూర్ నగర్, నడిగూడెం, మిర్యాలగూడ II టౌన్, గరిడేపల్లి పోలీసు స్టేషన్ ల పరిధిలో కట్టర్, హ్యాక్ సా బ్లేడ్ ఉపయోగించి దొంగతనాలు చేసినట్లు నిందితులు అంగీకరించరాని చెప్పారు.తదుపరి దొంగతనం చేసిన ఇట్టి కేబుల్ లను దొంగతనం చేసిన దగ్గరలో కాల్చి దాని నుండి కాపర్ వైర్ ( రాగి వైర్) ను తీసి బస్తాలలో వేసుకుని హైద్రాబాద్ కు తీసుకువెళ్లి అక్కడ జీడిమెట్ల, పటాన్ చెరువు ఏరియా లో ఫ్యాక్టరీ కి సంభందించిన గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బులు పంచుకుని జల్సాలు చేస్తున్నారు.
ఈ విధంగా 9 దొంగతనాలకు సంభందించి మొత్తం రూ. 3,25,000 విలువైన బిఎస్ఎన్ఎల్ టవర్ కేబుల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ని దొంగిలించగా వారి వద్ద నుండి రూ. 2,75,000 నగదు, నడిగూడెం పోలీసు స్టేషన్ కి సంభందించిన కేసు ప్రాపర్టీ 270 మీటర్ల ఆర్ ఎఫ్ కేబుల్, దొంగతనాలకు ఉపయోగించిన ఫోర్డ్ కారు, కట్టర్, హ్యాక్ సా బ్లేడ్, మరియూ దొంగతానాలకు ఉపయోగించిన ఫోర్డ్ ఫిగో కార్ ను నిందితుల నుండి స్వాదీనం చేసుకోవటం జరిగిందన్నారు.
కోదాడ పట్టణం బాలాజీనగర్ కు చెందిన శ్రావణ కుమార్ గతంలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ నందు పని చేసిన అనుభవం ఉన్నది, ఇతనిపై గతంలో 4 దొంగతనం కేసులు ఉన్నాయి. ఏ 1 శ్రీనాథ్, ఏ 2 వంశీకృష్ణ ను ఈరోజు రిమాండ్ కు తరలించటం జరుగుతుందన్నారు. ఇట్టి కేసు లో నిందితుల ఆచూకీ వెలికి తీయటం లో విశేషంగా కృషి చేసిన మునగాల సిఐ రామకృష్ణా రెడ్డి, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది కొండలు, ఎం. రామారావు లను అభినందిస్తూ వారికి రివార్డ్స్ అందించడం జరిగినది.
దొంగతనాల నివారణలో ప్రజలు పోలీసు వారికి సహకరించాలి, అనుమానితుల సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. అలవాటుగా నేరాలకు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. విలేకరుల సమావేశం లో మునగాల సి ఐ రామకృష్ణ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు,ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.
MOST READ,:
-
Karimnagar : లీజు రద్దు చేయాలి.. దేవాలయ భూములను కాకాపాడాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..!
-
Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!
-
Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!
-
TG News : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం అలా పంపిణీ..!
-
Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశం.. తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..!
-
TG News : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఆగస్టు 22 లోపే..!









