Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!
Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!
అర్వపల్లి, మన సాక్షి :
ఎరువుల దుకాణ యజమానులు యూరియా దాచిపెట్టి ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల తాసిల్దార్ భాష పాక శ్రీకాంత్ అన్నారు. మంగళవారం మండల అధికారులతో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినంత యూరియా ను సరఫరా చేస్తున్నారని అన్నారు.
రైతులు అవసరం ఉన్నంతవరకే యూరియాను కొనుగోలు చేయాలని, కొంతమంది రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారని అన్నారు. దుకాణ యజమానులు యూరియాను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా అమ్మిన, యూరియాతోపాటు మిగతా ఎరువులు బలవంతంగా తీసుకోవాలని ఇబ్బంది పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పెద్దింటి గణేష్, ఎస్సై ఈట సైదులు, ఏ ఎస్ ఐ ను మేకల రాములు, రామకోటి, దుకాణ యజమానులు నల్ల రామచంద్రయ్య, శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
-
District collector : ప్రభుత్వ పాఠశాలలో దగ్గరుండి మెనూ పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
District SP : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!
-
Open University : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్.. ధరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడంటే..!
-
TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!









