Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లా

Urea : ఒక్క బస్తా యూరియా ఇవ్వండి సార్.. పిఎసిఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతన్న రైతులు.. (వీడియో)

Urea : ఒక్క బస్తా యూరియా ఇవ్వండి సార్.. పిఎసిఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతన్న రైతులు.. (వీడియో)

తొర్రూర్, మన సాక్షి :

వానాకాలం పంటల కోసం అత్యవసరమైన యూరియా ఎరువు కోసం రైతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం తెల్లవారుజామునే అమ్మపురం రోడ్డులోని పిఎసిఎస్ భవనం ఎదుట రైతులు క్యూ కట్టారు. గంటల తరబడి ఎదురు చూసినా ఒక్కో బస్తా కూడా దొరకని పరిస్థితి నెలకొంది.

రెండు బస్తాలు యూరియా పొందాలంటే నానో లింక్ తప్పనిసరి అనే నిబంధన రైతుల ఆగ్రహానికి కారణమైంది. “ఒక బస్తా ఎరువు ఇవ్వండి సార్” అంటూ పిఎసిఎస్ అధికారుల కాళ్లు మొక్కుతన్న దృశ్యాలు అక్కడి వారిని కలచివేశాయి.

మనసు పెట్టి పంట పండించే రైతు… ఎరువు కోసం ఇంత అవమానం పడాలా? అంటూ అక్కడున్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఎరువులు అందకపోవడం వల్ల పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పాలనలో రైతుల దుస్థితి అనిరైతులు మండిపడుతూ… “ఉదయం నుండి సాయంత్రం వరకు క్యూల్లో నిలబడి చివరికి రెండు సంచులు మాత్రమే ఇస్తున్నారు. మిగతా అవసరాలు ఎక్కడి నుంచి తీర్చుకోవాలి?” అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలనలోనే రైతులపై ఇంతటి దౌర్జన్యం జరుగుతోందని ఆరోపించారు. ముందుగానే సరిపడా యూరియా నిల్వలు చేయకపోవడమే ఈ గందరగోళానికి కారణమని రైతులు విరుచుకుపడ్డారు. పోలీసుల బందోబస్తులో ఎరువులు పంచడం రైతులకు మరింత అవమానం కలిగించిందని స్థానికులు మండిపడ్డారు.

వీడియో..!

MOST READ : 

  1. Nano Urea : నానో యూరియా పిచికారి ఎలా.. రైతులకు అవగాహణ..!

  2. Urea : యూరియా కొరత లేదు.. ఎరువుల గోదామును పరిశీలించిన జిల్లా సహకార అధికారి..!

  3. Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!

  4. Robot : అచ్చం అమ్మాయిలా ఆకట్టుకున్న రోబో.. ప్రసంగించిన తీరుకు విద్యార్థినుల ఫిదా..!

మరిన్ని వార్తలు