Breaking Newsఆంధ్రప్రదేశ్

Pavan Kalyan : ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు..!

Pavan Kalyan : ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు… కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానుల మధ్య భారీ కేక్ కటింగ్
మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య భారీ కేక్ ను కటింగ్ చేసి జనసేన అధినాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

బెస్ట్ బిజినెస్ అవార్డు గ్రహీత వినోద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన జనసేనాని జన్మదిన వేడుకలు ఒక పండగలా ఘనంగా జరుపుకోవడం, అందులో నేను ముఖ్య అతిధిగా పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. మన అధినేత పవన్ కల్యాణ్ ధైర్యం, పట్టుదల, పోరాట పటిమ మనందరిలోనూ ఉంటే మనల్ని కూడా ఎవరూ ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేసారు. ఇలాంటి గొప్ప నాయకునికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షును ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.

ఈ వేడుకలలో బేకరీ జనార్ధన, వినోద్, కోలాహరినాథ్, జనసేన సూరి,ఆంజప్ప, స్టూడియో శ్రీనివాస్, సిఖిందర్ ప్రతాఫ్, జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Shoes : షూస్ ఎంపిక ఎలా ఉండాలో తెలుసా.. ఇలా ఉంటేనే కొనండి..! 

  2. Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!

  3. Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!

  4. Sony: సోనీ ఇండియా నుండి హై-స్పీడ్ CFexpress 4 మెమొరీ కార్డులు.. రికార్డింగ్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఇక సులభం..! 

మరిన్ని వార్తలు