Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : గణేష్ నిమజ్జనంలో అపశృతి.. సాగర్ ఎడమ కాలువలో తండ్రి, కొడుకులు గల్లంతు..!

Miryalaguda : గణేష్ నిమజ్జనంలో అపశృతి.. సాగర్ ఎడమ కాలువలో తండ్రి, కొడుకులు గల్లంతు..!

వేములపల్లి, మన సాక్షి :

గణేష్ నిమజ్జన లో భాగంగా ఒకే కుటుంబంలో అపశృతి చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండల కేంద్రంలో ఎడమ కాలువలో శుక్రవారం తండ్రి , కుమారుడు గల్లంతయ్యారు.

వివరాలలోకి వెళితే మాడుగులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన కొంతమంది భక్తులు గణేష్ విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమానికి వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువ లో వినాయక విగ్రహాన్ని కాలువలో నిమజ్జన చేసి తర్వాత ఆగ మోత్కూర్ గ్రామానికి చెందిన పున్న సాంబయ్య(45)అనే వ్యక్తి కాలువలోనికి దిగి కాళ్లు కడుక్కోవడానికి ప్రయత్నించాడు.

అక్కడే ఉన్న గ్రామపంచాయతీ సిబ్బంది పోలీసు వారు హెచ్చరించగ అక్కడి నుండి వెళ్లి పక్కనే ఉన్న మెట్ల దగ్గర దిగి కాళ్లు కడుక్కుంటుండగా కాలుజారి నీటిలో పడడంతో వెంటనే తన కుమారుడు పున్న శివమణి (20) సం గమనించి తండ్రిని కాపాడడానికి కోసం నీటిలో దూకగ ఇద్దరు కూడా ఒకరినొకరు అలుముకొని నీటి ప్రవాహానికి కొట్టుకు పోవడం జరిగిందని చెప్పారు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్,డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ప్రమాద స్థలానికి చేరుకుని వెంటనే ఎఫ్డిఆర్ఎఫ్ బృందాన్ని రప్పించడం జరిగిందని వీలైనంత త్వరగా వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.

నిమజ్జన కార్యక్రమ ప్రాంతంలో మొదటి రోజు నుండి అక్కడికి వచ్చినటువంటి ఈతగాళ్ల విషయంలో స్థానిక ఎమ్మార్వో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు విధులకు రావడం మానివేశారని ప్రమాదం జరిగిన సమయంలో వారు ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు చర్చించుకున్నారు.

చనిపోయిన వ్యక్తికి ఒక కూతురు కూడా ఉండడంతో గత పది సంవత్సరాల క్రితం తల్లి చనిపోవడం, ఇప్పుడు తండ్రి మరియు అన్న ఇద్దరు మరణించడంతో అనాధ అయిన ఆ చిన్న పాపను చూసి మోత్కూర్ గ్రామంలో ప్రజలు కన్నీటి లో మునిగిపోయారు.

MOST READ : 

  1. Drinking Water : ఖాళీ బిందెలతో త్రాగినీటి కోసం మహిళలు పంచాయతీ కార్యాలయం ముట్టడి..!

  2. Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..! 

  3. ACB : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జిల్లా మత్స్యశాఖ అధికారిని..!

  4. Bandi Sanjay : ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు