Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

నల్గొండ, మన సాక్షి :

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఐసీయు విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్
కే. భార్గవ్ ను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు ఆమె సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి లోని ఐసి యు లో పనిచేసే కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు ఏప్రిల్ 2025 నుండి ఇప్పటివరకు జీతాలు రాలేదని ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించడం జరిగింది.

ఈ విషయంపై విచారించగా ఐసీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఆల్ఫా స్వయం శక్తి సంఘం కాంట్రాక్టు పీరియడ్ ఈ సంవత్సరం మార్చి 31 తో ముగిసిందని, అయితే 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఏజెన్సీకి కేటాయించడం లేదా అదే ఏజెన్సీని రెన్యువల్ చేసే విషయమై సీనియర్ అసిస్టెంట్ కే. భార్గవ జిల్లా ఉపాధి కల్పనా అధికారికి ఎలాంటి ఫైల్ ను సమర్పించలేదని తెలిపారు.

అందువల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించినందుకుగాను తక్షణమే భార్గవ్ ను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. క్రమశిక్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యే వరకు భార్గవ్ సస్పెన్షన్ లో కొనసాగుతారని, సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా భార్గవ్ కార్య స్థానాన్ని వదిలి వెళ్ళకూడదని కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

MOST READ :

  1. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్..!

  2. Miryalaguda : నల్గొండ జిల్లాలో రూ.200 కోట్ల యూరియా కుంభకోణం.. అక్రమాలకు హబ్ గా మిర్యాలగూడ..!

  3. Ex DSP Nalini : మాజీ డి.ఎస్.పి నళిని సంచలన పోస్ట్.. విషయం ఏంటంటే..!

  4. Miryalaguda : శిష్య స్కూల్ లో దసరా, బతుకమ్మ సంబరాలు..!

మరిన్ని వార్తలు