Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలు

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. మహిళా ఆటో డ్రైవర్లు ఆదర్శంగా నిలవాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. మహిళా ఆటో డ్రైవర్లు ఆదర్శంగా నిలవాలి..!

కరీంనగర్, మనసాక్షి :

మహిళా ఆటో డ్రైవర్లు ఆర్థిక సాధికారత సాధించి తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రంలో ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ లో శిక్షణ పొంది ఉపాధి పొందుతున్న మహిళలతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు విభిన్న రంగాలలో రాణించాలని, స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో ఆటో డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ ఇచ్చామని అన్నారు. అంతేకాకుండా వారికి ఉచితంగా ఆటోలు అందజేశామని తెలిపారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా ఆటో డ్రైవర్లు ఉపాధి పొందాలని పేర్కొన్నారు. ఆటోలను కుటుంబ సభ్యులకు, ఇతరులు ఎవరికీ ఇవ్వరాదని అన్నారు. ఆటోలు కేటాయించిన మహిళలే నడుపుతూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ సమావేశంలో మహిళా ప్రాంగణం మేనేజర్ సుధారాణి పాల్గొన్నారు.

MOST READ: 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలనం..!

  2. Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!

  3. Meals : అరటి ఆకులో భోజనం.. దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు, మీకు తెలుసా..!

  4. Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు