Breaking Newsfoodజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : చికెన్ తిని ఆరుగురికి అస్వస్థత..!

Suryapet : చికెన్ తిని ఆరుగురికి అస్వస్థత..!

పెన్ పహాడ్, మన సాక్షి :

చికెన్ తిని ఆరుగురికి తీవ్ర అస్వస్థత గురైన సంఘటన మండల పరిధిలోని దూపాడు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు కత్తి ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం..

04 న (శనివారం) బాధితుడు కత్తి ఉపేందర్ తన మనవడి 21వ రోజు వేడుక చేసుకుందామని మండల కేంద్రం అయినా పెన్ పహాడ్ లో క్వాలిటీ చికెన్ సెంటర్ వద్ద 06 కేజీల చికెన్ తీసుకుని వెళ్లి చిన్న శుభకార్యం నిర్వహించారు.

భోజనం చేసిన గంట తర్వాత వారి కుటుంబ సభ్యులకు స్వల్పంగా వాంతులు అవుతుంటే మామూలు వాంతులు అని పట్టించుకోలేదు. తెల్లవారుజాము నుండి విపరీతంగా వాంతులు విరోచనాలు అవుతుంటే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ముగ్గురిని అడ్మిట్ చేశారు. ఇద్దరు చిన్నారులను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.

మరో మహిళను మరో ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. బాధితుడు చికెన్ సెంటర్ నిర్వాహకుని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నాడని ఆయన అన్నారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చికెన్ తినడం వల్లనే అస్వస్థత గురయ్యారని ఆయన అన్నారు.

క్వాలిటీ చికెన్ సెంటర్ పై అధికారులు చర్యలు తీసుకొని. ప్రజల ప్రాణాలను రక్షించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జరిగిన విషయంపై పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పత్రిక విలేకరులకు ఆయన తెలిపారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం..!

  2. Chinese Wok : తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ వోక్ విస్తరణ.. సరికొత్త ప్రచారం షురూ..!

  3. Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!

  4. Rusal : అల్యూమినియం స్క్రాప్ శుద్ధిలో రూసల్ విప్లవాత్మక పురోగతి..!

మరిన్ని వార్తలు