Heavy Rain : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!

Heavy Rain : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొంమేపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా గ్రామంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వర్షం ఉద్ధృతి వల్ల కొంమేపల్లి నుండి దేవరకొండ కు వెళ్లే దారిలో ఉన్న ప్రధాన రహదారిపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రమాదాలను నివారించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
పోలీస్ బందోబస్తు ఏర్పాటు:
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. దేవరకొండ పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన బృందాలు కొంమేపల్లి చేరుకుని వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాయి. రాకపోకలు నిలిపివేసిన మార్గాల్లో ప్రజలు వాహనదారులు వెళ్లకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షపు నీరు తగ్గుముఖం పట్టేవరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిసింది. పోలీసులు శోభన్, మహమ్మద్ ఫయాజ్ ఉన్నారు.
MOST READ :
-
By Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ..!
-
Ring : బొటనవేలికి వెండి ఉంగరం.. జ్యోతిష్య, ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..!
-
వీళ్లు మామూలు ముదుర్లు కాదు.. పని చేసే సంస్థకే కన్నం..!
-
District collector : ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!









