Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Khammam : హోటళ్లు, వ్యాపార సంస్థలో ఆకస్మిక దాడులు.. జరిమానా..!

Khammam : హోటళ్లు, వ్యాపార సంస్థలో ఆకస్మిక దాడులు.. జరిమానా..!

ఖమ్మం, మన సాక్షి :

ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లలో అపరిశుభ్రత, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపార సంస్థలపై కార్పొరేషన్ గురువారం జరిమానాలు విధించారు. జరిమానాల ద్వారా మొత్తం రూ.52 వేలు వసూలు చేశారు.

చౌదరి హోటల్ యాజమాన్యం పరిశుభ్రత పాటించక పోవటంతో రూ.10వేలు, మణికంఠ హోమ్ ఫుడ్ యజమానికి రూ 3వేలు, వెంకటేశ్వర టీ స్టాల్ యజమానికి రూ. 3వేలు జరిమాన విధించారు. అలాగే ప్రకాశ్ నగర్ లోని కోల్డ్ స్టోరేజీలో నిబంధనలు పాటించక పోవడంతో మిర్చి ధూళి ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో రూ. 6వేలు జరిమానా విధించారు.

అలాగే ప్లాస్టిక్ విక్రయిస్తున్న ఒక దుకాణంలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వినియోగించడంతో రూ. 3వేలు, సాయి తేజ దుకాణంలో నిషేధిత ప్లాస్టిక్ ను ఉపయోగించడంతో రూ.4వేలు, అలాగే సుదర్శన్ ట్రేడర్స్ యాజమాన్యానికి రూ. 6వేలు, శ్రీనివాస ట్రేడర్స్ యాజమాన్యానికి రూ 5000 జరిమానా విధించారు.

ఓపెన్ ప్లాట్ యజమానికి రూ 6000, రోడ్డు మీద చెత్త వేసినందుకు ఎస్కే ఖాజా అనే వ్యక్తికి రూ. 3వేలు, చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించినందుకు ప్రైవేట్ స్వచ్ ఆటోకు రూ 3వేలు జరిమానా విధించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, పరిశుభ్రత లోపం, రోడ్లపై చెత్త వేయడం వంటి ఉల్లంఘనలపై ఈ చర్యలు తీసుకున్నామని పారిశుద్ధ్య పర్యవేక్షకుడు సాంబయ్య తెలిపారు. సుమారు 10 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

MOST READ :

  1. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మేఘా జాబ్ మేళా.. 150 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..!

  2. Suryapet : మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగా మగ్గం వర్క్స్ శిక్షణ..!

  3. Suryapet : భార్య భర్తలు ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి..!

  4. Gold Price : ఒక్క రోజులోనే ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. ఎంత కష్టం వచ్చిందో ఏమో.. కుటుంబం మొత్తం రైలు కిందపడి ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు