Nizamabad : ఇరాక్ లో ఆలూర్ వాసి మృతి..!

Nizamabad : ఇరాక్ లో ఆలూర్ వాసి మృతి..!
ఆర్మూర్, మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కేంద్రానికి చెందిన కుర్మే బీజ చిన్న రాజేష్ (45) గల్ఫ్ దేశంలోని ఇరాక్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక, జీవనోపాధి కోసం సుమారు ఒకటిన్నర సంవత్సరం క్రితమే రాజేష్ విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఒక కట్టడం పనిలో పనిచేస్తూ నిన్న ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ పై నుంచి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు శనివారం కుటుంబీకులు తెలిసింది.
మృతుడు రాజేష్‌కు అమ్మ , భార్య సునీత, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఆకస్మిక మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాజేష్ మృతదేహాన్ని స్వదేశానికి, ఆలూర్ గ్రామానికి తేవడానికి ప్రభుత్వ సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వినతిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మృతదేహాన్ని గ్రామానికి రప్పించేలా చూడాలని కుటుంబీకులు గ్రామస్తులు కోరారు.
MOST READ :
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పదవులు రద్దు..!
-
District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!
-
Nalgonda : పిన్ని కూతురిని గర్భవతిని చేసిన అన్న.. 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష..!
-
PDS : అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. మహిళ అరెస్ట్, 20 క్వింటాళ్లు స్వాధీనం..!









