Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Musi : మూసి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 8 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

Musi : మూసి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 8 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

కేతేపల్లి, మనసాక్షి :

కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టుకు బుధవారం భారీగా వరద నీరు పోటెత్తింది. భాగ్య భాగ్యనగరంలోని రెండు ప్రాజెక్టుల నుండి నీటి విడుదల, బిక్కేరుకు వరద, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల తో మూసి ప్రాజెక్టు రిజర్వాయర్ లోనికి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

దాంతో అప్రమత్తమైన అధికారులు 7 క్రస్ట్ గేట్లను 10 ఫీట్లు, ఒక్క గేటును ఐదు ఫీట్ల మేర ఎత్తి 47 729.70 క్యూసెక్కుల నీటిని ఏటిలోనికి వదిలారు. కుడి కాలువ ద్వారా 47.61 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు రిజర్వాయర్ లోనికి 33 931.55 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని, 47827.66 క్యూసెక్కుల నీటిని బయటికి పంపడం జరుగుతుందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు.

ప్రాజెక్టు నీటిమట్టాన్ని 645 ఫీట్లు కాగ, 643 ఫీట్ల నీటిని నిలకడగా ఉంచటం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రాజెక్టు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజర్వాయర్ నీటి విడుదల పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

MOST READ : 

  1. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి దేవస్థానం ఇంజనీర్..!

  2. New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!

  3. Gold Price : మరోసారి గోల్డ్ ధర ఢమాల్.. ఒక్కరోజే భారీగా తగ్గిన ధర..!

  4. Heavy Rain : స్ట్రక్చర్ సహాయంతో నిండు గర్భిణిని వాగు దాటించిన 108 సిబ్బంది.. (వీడియో)

  5. Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!

మరిన్ని వార్తలు