Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరిగితే వారిపై చర్యలు..!

District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరిగితే వారిపై చర్యలు..!

నల్లగొండ, మన సాక్షి :

ఆడబిడ్డను కాపాడుకోవడంలో భాగంగా జిల్లాలో శిశువిక్రయాలు, బాల్య వివాహాలు, బాలికల పై లైంగిక దాడుల వంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అన్ని సంక్షేమ శాఖల అధికారులు ఆర్ సి ఓ లు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాలో ఎక్కడ శిశు విక్రయాలు జరగకుండా, అలాగే బాల్య వివాహాలు, హాస్టల్ విద్యార్థులపై లైంగిక దాడులు వంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎక్కడైనా శిశు వివిక్రయాలు జరిగితే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

జిల్లాలో ఇటీవల శిశువిక్రయాలు , బాల్య విద్యార్థులపై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, తదితర సంఘటనల నేపథ్యంలో శనివారం ఆమె తన చాంబర్లో సంక్షేమ అధికారులు, ఆర్సిఓలతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి చెందిన సమాజంలో ఇంకా శిశు విక్రయాలు, బాలికలపై లైంగిక దాడుల వంటివి జరగడం సిగ్గుచేటని అన్నారు. అన్ని శాఖలు ఈ విశయాలపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు.

జిల్లాలోని దేవరకొండ, పెద్దవూర, తదితర ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ విషయం పై సి డి పి ఓ లు మరింత అప్రమత్తంగా ఉండి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. దేవరకొండ, నేరేడుగోమ్ము , చందంపేట, పెద్దవూర, అడవిదేవులపల్లి వంటి మండలాలలో శిశువిక్రయాలు జరగకుండా, అలాగే బాల్య వివాహాలు వంటివి జరగకుండా అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.

అంతేకాక వాల్ పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, చిన్న చిన్న వీడియోల ద్వారా సమాజంలోని అందరికీ చైతన్యం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చేవారం సి డి పి ఓ లు, సూపర్వైజర్లతో ఈ విషయంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు మండలాలలో అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లను తిరిగి ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా చూడాలని ఆదేశించారు.

జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహనిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, సాంఘిక సంక్షేమ డిడి శశికళ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, జిల్లా ఉప వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Traffic : రైల్వే బ్రిడ్జి కింద వర్షం నీరు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు..!

  2. Good News : ఏకలవ్య మోడల్ స్కూల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..!

  3. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!

  4. Gold Price : మరోసారి గోల్డ్ ధర ఢమాల్.. ఒక్కరోజే భారీగా తగ్గిన ధర..!

మరిన్ని వార్తలు