Nalgonda : భక్తిశ్రద్ధలతో గురునానక్ జయంతి..!

Nalgonda : భక్తిశ్రద్ధలతో గురునానక్ జయంతి..!
నల్లగొండ, మనసాక్షి :
సిక్కుల మొదటి గురువు గురునానక్ జయంతిని బుధవారం పట్టణంలోని గురునాన ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ బండారి మాట్లాడుతూ సిక్కుల ఆరాధ్యదైవము, మొదటి గురువు గురునానక్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
గురునానక్ బోధనలైన దేవునిపై భక్తి, నిస్వార్ధ సేవ, మానవతావాదం, సమానత్వం, నిజాయితీ కలిగి ఉండాలని, కుల మత వివక్ష లేకుండా మానవ మనుగడ సాగించాలని,మత విభేదాలు తొలగించాలని బోధించారని ఆ బోధనలను నేటి తరం ప్రజలు కలిగి ఉండాలని అన్నారు. గురునానక్ బోధనలను పాటించాలని మానవ మనుగడకు ఆయన బోధనలు సహకరిస్తాయన్నారు. అనంతరం మహాప్రసాద అన్న వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో కుల్దీప్ సింగ్ బండారి,గురుమిత్ సింగ్ బండారి, సమీరా సింగ్ బండారి. సర్దార్,డాక్టర్ ఆమన్ రీత్ సింగ్,డాక్టర్ సుమన్, డాక్టర్ సిక్కి, డాక్టర్ మేఘన, జస్వల్ సింగ్ ఆగా, ప్రదీప్ కౌర్ ఉపేందర్ కౌర్,ధరమ్ కౌర్ గుగులోత్ పవన్ జిత్తు కౌర్. నాతోపాటు వందలాదిమంది సిక్కు సోదరిమనులు సోదరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Hyderabad : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఆటో డ్రైవర్.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య..!
-
Tasildar : చింతపల్లి మండల తహసిల్దార్ గా విజయలక్ష్మి.. ఎవరో తెలుసా..!
-
Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!
-
Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!










