Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణవిద్య

Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!

Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కన్నా అదనపు బాదుడు

ఇదేమని ప్రశ్నిస్తే దబాయిస్తున్న యాజమాన్యాలు

గోదావరిఖని, మన సాక్షి :

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరీక్ష షెడ్యూల్ తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇదే ఆదునుగా భావించిన యాజమాన్యాలు పరీక్ష ఫీజు పేర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజుల కన్నా పదింతలు అదనంగా తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.

వార్షిక పరీక్ష పేరుతో ఒక్కో విద్యార్థి నుండి 1500 నుండి 2600 రూపాయలు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజు కన్నా పది రెట్లు అధికంగా వసూలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలో పలు రకాల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీకి గురిచేసిన యాజమాన్యాలు, ఇప్పుడు పరీక్ష ఫీజు పేరుతో వారి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు.

నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఏకంగా 2700 రూపాయలు పరీక్ష ఫీజు వసూలు చేస్తుంది. అధిక వసూళ్ళపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మాకు ఏమీ కాదు.. మేము చెప్పినంత ఇవ్వాలి.. లేదంటే పిల్లలను పరీక్షలు రాయనివ్వమంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

వార్షిక పరీక్షల మెటీరియల్ పేరు చెప్పి ఫీజు కట్టించుకుం టున్నారని చేసేది ఏమి లేక వారు చెప్పిన ఫీజు కడుతున్నట్లు చెపుతున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత విద్యాశాఖ అధికారులకు తెలియదా లేక తెలిసినా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారా అంటూ విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

డి ఈ ఓ ఆదేశాలు బేఖాతర్ :

పరీక్ష ఫీజు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి ఆదేశాలు జారీ చేసిన ఆదేశాలను ప్రైవేట్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నారు. అధికారులు ఎన్ని ఆదేశాలు ఇచ్చిన అవేమీ పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఫీజులకు రసీదులు ఉండవు :

పరీక్ష ఫీజు కట్టిన ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. రసీదులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తే కాగితం మీద రాసి ఇస్తున్నట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యా సంస్థ దోపిడిపై సంబంధిత విద్యాశాఖ అధికారులు తనిఖీలు జరిపి వాటిపై చర్యలు తీసుకోవాలని పోషకులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అధిక పరీక్ష ఫీజు వసూలు చేసిన పాఠశాల అనుమతులు రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజు కన్నా ఆధారంగా వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

విద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై తనిఖీలు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వివరణ :

ఈ విషయమై రామగుండం మండల విద్యాధికారిని వివరణ కోరగా అధిక పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పాఠశాలలపై తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని నిబంధన లు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.

MOST READ : 

  1. Alumni : 13 ఏళ్ల తర్వాత ఘనమైన వసంతోత్సవం.. గురు శిష్యుల బంధం మహోన్నతమైనది..!

  2. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  3. TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

  4. TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

మరిన్ని వార్తలు