Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : గుర్తుతెలియని మృతదేహం లభ్యం..!

Narayanpet : గుర్తుతెలియని మృతదేహం లభ్యం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి

నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పక్ పల్లి గ్రామ శివారులో శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో కుళ్లిపోయిన ఒక గుర్తు తెలియని శవంను గుర్తించినట్టు రూరల్ ఎస్సై రాముడు తెలిపారు. ప్రాథమిక పరిశీలనలో, మృతుని వయస్సు 30 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చని, మరణించి సుమారు 10 నుండి 15 రోజులు అయి ఉండవచ్చని ఎస్ఐ తెలిపారు.

మృతుని శరీరంపై ఎటువంటి గుర్తింపు వస్తువులు లేదా ఆధారాలు లభించకపోవడంతో, మృతుని వివరాలు తెలియరాలేదు. దీనికి సంబంధించి సమాచారం తెలిసిన వారు వెంటనే ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని పేట రూరల్ ఎస్సై రాముడు తెలిపారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు రూరల్ ఎస్ఐ
8712670417, సీఐ నారాయణపేట 8712670383 సంప్రదించాలని ఎస్సై తెలిపారు. శవం గుర్తింపు, మరణానికి గల కారణాలపై నారాయణపేట రూరల్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

MOST READ : 

  1. ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!

  2. TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..! 

  3. BIG BREAKING : జమ్ము కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మంది గాయాలు..!

  4. Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!

మరిన్ని వార్తలు