Miryalaguda : వాణిజ్య శాస్త్రంలో శివకృష్ణకు డాక్టరేట్..!

Miryalaguda : వాణిజ్య శాస్త్రంలో శివకృష్ణకు డాక్టరేట్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ ఎం. శివకృష్ణకు వాణిజ్య శాస్త్రంలో డాక్టరేట్ ప్రధానం చేసిన సందర్భంగా కేఎన్ఎం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు ఎం. శివకృష్ణకు ఘనంగా సన్మానం చేశారు.
వాణిజ్య విభాగం డీన్ ఆచార్య ఐ. ఆనంద్ పవార్ పర్యవేక్షణలో “ఎ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ ఆఫ్ సెలెక్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా” అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించడంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ను అందించినది.
శివకృష్ణ ప్రస్తుతం కె ఎన్ ఎమ్ ప్రభుత్వ కళాశాలలో సహాయ ఆచార్యునిగా మరియు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పూర్తిని తీసుకొని పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మల్గిరెడ్డి భీమార్జున్ రెడ్డి, సీనియర్ అధ్యాపకులు వెంకటరమణ, అకాడమిక్ కో ఆర్డినేటర్ నాగరాజు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ ఎన్ సి సి, సి టి ఓ డాక్టర్ నరేష్ గుమ్మడి, మ్యాథమెటిక్స్ లెక్చరర్ యు. నాగరేఖ రాణి, టీచింగ్, నాన్ టీచింగ్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని డాక్టర్ శివకృష్ణను అభినందించారు.
MOST READ :
-
Accident : రోడ్డు ప్రమాదంలో కూతురు మృతి.. తండ్రికి తీవ్ర గాయాలు..!
-
TG News : జూబ్లీహిల్స్ లో రౌండ్ ల వారీగా కాంగ్రెస్ ఆదిత్యం ఇలా.. ముగిసిన ఏడు రౌండ్ల లెక్కింపు..!
-
Jubilee Hills : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం.. ప్రతి రౌండ్ లోను ఆదిత్యం..!
-
Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. వారికి రూ.లక్ష డొనేషన్..!









