Breaking Newsక్రైంతెలంగాణసినిమాహైదరాబాద్

TG News : సిపి సజ్జనార్ సంచలన ప్రకటన.. ఐ బొమ్మ రవి వద్ద లక్షలమంది డాటా..!

TG News : సిపి సజ్జనార్ సంచలన ప్రకటన.. ఐ బొమ్మ రవి వద్ద లక్షలమంది డాటా..!

మన సాక్షి :

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గురించి సిటీ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత దిల్ రాజు, దర్శకులు రాజమౌళి తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సజ్జనార్ మాట్లాడుతూ..

పోలీసులకు సవాల్ విసిరిన ఐ బొమ్మ రవి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూస్తున్నారని అన్నారు. పైరసీ సినిమాల కోసం ఏర్పాటు చేసిన ఇలాంటి వెబ్సైట్లను ఎవరు ఓపెన్ చేసినా వారి పర్సనల్ డేటా చోరీకి గురి అవుతుందని పేర్కొన్నారు. ఐ బొమ్మ సూత్రధారి ఇమ్మడి రవిని పట్టుకున్నట్లు తెలిపారు.

అతనిపై ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు. పైరసీ ముసుగులోనే బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారని సజ్జనార్ పేర్కొన్నారు. సైట్ ఓపెన్ చేసే వారి డేటా మొత్తం అతని వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. టెలిగ్రామ్ ద్వారా పైరసీ రాకెట్ నడిపినట్లు ఆయన పేర్కొన్నారు.

సినీ పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది కుటుంబాలు బతుకుతున్నాయని, అందరి కష్టాన్ని ఆయన దోచుకున్నాడని తెలియజేశారు. రూ. 20 కోట్ల వరకు సంపాదించినట్లు సంజనార్ పేర్కొన్నాడు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉందని, మీ డేటా డార్క్ వెబ్ కి చేరే అవకాశం ఉందని, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతోమంది పేరెంట్స్ కడుపుకోత మిగిలింది అన్నారు.

మహారాష్ట్రలో ప్రహల్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని, పాన్ కార్డు కూడా ప్రహల్లాద్ పేరుతోనే ఉందని, రవికి ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉందని, కరేబియన్, ఐలాండ్ సిటిజెన్షిప్ కూడా తీసుకున్నట్లు తెలిపారు.

ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్ ఎన్నో దేశాలు తినిగాడని, అమెరికా నెదర్లాండ్స్ లో సర్వర్లను పెట్టినట్లు సజ్జనార్ వెల్లడించారు. కాగా పైరసీ ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్టు చేసిన పోలీసులను సన్మానించారు.

MOST READ : 

  1. Miryalaguda : రేపు మిర్యాలగూడలో మంత్రుల పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..!

  2. Bus Fire : మరో బస్సు దగ్ధం.. 42 మంది సజీవ దహనం..!

  3. Miryalaguda : ఎస్‌వి మోడల్ హై స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవం..!

  4. BIG BREAKING : జమ్ము కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మంది గాయాలు..!

  5. Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే కీలక నిర్ణయం.. మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక బస్సు..!

మరిన్ని వార్తలు