Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే కీలక నిర్ణయం.. మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక బస్సు..!

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే కీలక నిర్ణయం.. మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక బస్సు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని తుంగపాడు మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గురువారం మిర్యాలగూడ మండలం తుంగపాడు నందు గల మోడల్ స్కూల్ విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఆటో లలో గుంపులుగా వెళ్తున్న విద్యార్థులను అటుగా వెళ్తున్న మిర్యాలగూడ శాసనసభ్యులుబత్తుల లక్ష్మారెడ్డి చూశారు.
ఆటో ఆపి విద్యార్థులతో మాట్లాడారు. వెంటనే మిర్యాలగూడ ఆర్టీసీ డి ఎం కు ఫోన్ చేసి రేపటి నుంచి ఉదయం 8:30 వరకు మిర్యాలగూడ బస్టాండ్ లో మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం మోడల్ స్కూల్ వద్దకి వెళ్లి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి రేపటి నుంచి ఉదయం మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తునట్టు విద్యార్థులకు అందరికీ తెలియజేయాలని సూచించారు. ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసారు.
MOST READ :
-
TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!
-
Kho Kho : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో జిల్లా పరిషత్ విద్యార్థుల ప్రతిభ..!
-
Godrej : లిటరేచర్ లైవ్.. ప్రతిష్టాత్మక గోద్రేజ్ అవార్డులతో వైభవంగా ముగిసిన ముంబై లిట్‌ఫెస్ట్..!
-
Amangal : 120 కిలోల నల్ల బెల్లం, 120 కిలోల పట్టిక పట్టివేత.. ఇద్దరి నిందితుల అరెస్టు..!










