Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు దగ్ధం..!

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు దగ్ధం..!

కేతేపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామపంచాయతీ పరిధిలోని రాయపురం సెయింట్ ఆన్స్ స్కూల్ బస్సులను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి సమయంలో తగలబెట్టిన సంఘటన చోటుచేసుకుంది. ఇట్టి సంఘటనపై పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం రాయపురం గ్రామంలో సెయింట్ ఆన్స్ స్కూల్, ఎంతకాలంగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు.

ఇట్టి పాఠశాలలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ కళాశాల రెండు విద్యాసంస్థలుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థిని, విద్యార్థులు పాఠశాలకు వివిధ గ్రామాల నుండి విద్యార్థులు రావడానికి స్కూల్ ద్వారా బస్సులను ఏర్పాటు చేసినారు. అయితే రోజులాగే పాఠశాల ముగిసిన తర్వాత పాఠశాల ఆవరణలో తమకున్న బస్సులను పార్కింగ్ చేసినారు.

బుధవారం రాత్రి 10.30 గంటల సమయం లో రెండు స్కూల్ బస్సుల కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పరారైనారు. ఇట్టి విషయం గమనించిన యాజమాన్యం మంటలు అర్పించే ప్రయత్నం చేసినప్పటికీ వీలుకాకపోవడం తో ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

దగ్ధమవుతున్న రెండు బస్సుల వెంట మరో బస్సు ఉండటంతో పాఠశాల డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కకు తప్పించాడు.  ఈ విషయం పై పోలీస్ లకు పిర్యాదు చేసి నిప్పు అంటించిన దుండగులను పట్టుకొని శిక్షించాలని పాఠశాల యాజమాన్యం కోరుతున్నారు. దీంతో సెయింట్ ఆన్స్ స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు భయాందోళనకు గురౌతున్నారు.

ఇలాంటి సంఘటన ఎన్నడు జరుగపోవటం, ఒక విద్యాసంస్థలకు సంబంధించిన బస్సులను దగ్ధం చేయడం, సెయింట్ ఆన్స్ విద్యాసంస్థలు ఏర్పాటు అయిన తర్వాత ఈలాంటి దుర్ఘటన చోటు చేసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రమాదం జరిగిన స్థలంలో బస్సులను పరిశీలించారు. ఈ ప్రమాదం లో 40 లక్షల ఆస్తి నష్టపోయామని యాజమాన్యం తెలిపింది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించనున్నారు.

MOST READ NEWS : 

  1. YS JAGAN : మాజీ సీఎం జగన్ కేసులో కీలక మలుపు.. నేడు నాంపల్లి కోర్టుకు హాజరు..!

  2. Miryalaguda : మంత్రులకు ఘన స్వాగతం.. భారీ ర్యాలీతో దద్దరిల్లిన మిర్యాలగూడ..!

  3. TG News : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఖరారు..!

  4. Adhaar : రైతులకు ఆ సమయంలో ఆధార్ కార్డు వెంట తప్పనిసరి..!

మరిన్ని వార్తలు