TG News : సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్..!

TG News : సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు అయింది. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తక్కువగా ఉందని సంగారెడ్డి జిల్లా కు చెందిన మాజీ సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 17% గ్రామపంచాయతీలు మించలేదని జీవో 46 కు విరుద్ధమని హైకోర్టులో అతడు పిటిషన్ దాఖలు చేశాడు.
సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య తరపు న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 117 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారని పేర్కొన్నారు. పిటిషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు విచారణ గురువారం కు వాయిదా వేసింది. గురువారం విచారణ చేపట్టనున్నారు.
ఇప్పటికే అనేక కారణాలవల్ల వాయిదాలు పడిన సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ దాఖలు అయింది.
MOST READ :









