Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం

Sarpanch : సర్పంచ్ గా టికెట్ కేటాయిస్తే గెలుస్తా.. గ్రామాభివృద్దికి కృషి చేస్తా..!

Sarpanch : సర్పంచ్ గా టికెట్ కేటాయిస్తే గెలుస్తా.. గ్రామాభివృద్దికి కృషి చేస్తా..!

సంస్థాన్ నారాయణపురం, మన సాక్షి :

సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ కైసర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రవి కి వినతి పత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాల కాలం నుండి యూత్ కాంగ్రెస్ నాయకునిగా,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ పార్టీ విధేయుడిగా ఉంటూ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థుల గెలుపుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు.

ప్రస్తుత మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినప్పటి నుండి నేటి వరకు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు బూత్ స్థాయిలో పని చేయడం జరిగింది అని ఆయన తెలిపారు.

కావున తను పార్టీకి చేసిన సేవలు గుర్తించి ప్రస్తుతం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా తనను నియమించాలి అని ఆయన గ్రామ శాఖ కు వినతి పత్రంలో కోరారు. పార్టీ టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం మల్లయ్య, మునుగోడు నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఎస్కే బడేసాబ్, కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాతి నరేష్ గౌడ్, చుక్క సైదులు, జక్కలి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Elections : సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా.. అయితే ఇవి చూసుకోండి..!

  2. IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!

  3. SARPANCH : జాక్ పాట్ సర్పంచ్ మల్లమ్మ..!

  4. Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!

మరిన్ని వార్తలు