Hyderabad : డయల్–100కు క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్..!
డయల్–100కు అందిన సమాచారంపై క్షణాల్లో స్పందించిన మియాపూర్ పోలీసులు, ఏటీఎం దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని తమ అప్రమత్తతను చాటుకున్నారు.

Hyderabad : డయల్–100కు క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
డయల్–100కు అందిన సమాచారంపై క్షణాల్లో స్పందించిన మియాపూర్ పోలీసులు, ఏటీఎం దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని తమ అప్రమత్తతను చాటుకున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన హఫీజ్పేట్ ప్రాంతం, మార్తండనగర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం వద్ద 04.01.2026 రాత్రి సమయంలో దొంగతనం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.సంఘటనా స్థలంలో చేపట్టిన ప్రాథమిక విచారణలో వి. కాటమయ్య (24) అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు అనంతపురం జిల్లా, అక్కంపల్లి మండలం, జార్జ్పేట్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల చాకచక్యంతో ఏటీఎం వద్ద పెద్ద నష్టం తప్పినట్లు మియాపూర్ ఏసీపీ సీ.హెచ్. వై. శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా డయల్–100కు వచ్చే ప్రతి సమాచారంపై తక్షణ చర్యలు తీసుకుంటామని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మియాపూర్ పోలీసులు ప్రజలను కోరారు.
MOST READ
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ నిధులు దుర్వినియోగం, కార్యదర్శి సస్పెండ్..!
-
గ్రామ పంచాయతీలకు రానున్న మహర్దశ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
-
Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!
-
Nalgonda : సొంత జిల్లాకే కలెక్టర్ గా వచ్చిన బడుగు చంద్రశేఖర్.. ఏ ఊరంటే..!









