Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Suryapet : వ్యవసాయ విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం కీలకం.. ధూపహాడ్‌లో అవగాహన కార్యక్రమం..!

వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ పరిస్థితులను నేరుగా తెలుసుకోవడం చాలా అవసరమని కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి శాస్త్రవేత్తలు తెలిపారు.

Suryapet : వ్యవసాయ విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం కీలకం.. ధూపహాడ్‌లో అవగాహన కార్యక్రమం..!

పెన్ పహడ్, మనసాక్షి:

వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ పరిస్థితులను నేరుగా తెలుసుకోవడం చాలా అవసరమని
కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి శాస్త్రవేత్తలు తెలిపారు.
గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం (రావే)లో భాగంగా ధూపహాడ్ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

వివరాలు :

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం ధూపహాడ్ గ్రామ రైతు వేదికలో లైలా అకాడమీకి చెందిన బిఎస్సి (వ్యవసాయం) డిగ్రీ విద్యార్థినిలు గ్రామీణ వ్యవసాయ విధానాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి శాస్త్రవేత్త డి. అదర్స్ మాట్లాడుతూ, గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ (PRA) ద్వారా వ్యవసాయం, నీటి వనరులు, జనాభా, పంటల పరిస్థితులను
విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు తెలిపారు.

గ్రామీణ విశ్లేషణ :

విద్యార్థులు గ్రామ పటం, వెన్ డయాగ్రామ్, పై చార్టులు, చిత్రాల రూపంలో గ్రామ వనరులు, రైతుల వర్గీకరణ, నీటి వనరులు, వ్యవసాయ దిగుబడులు, యాజమాన్య పద్ధతులను
రైతులకు వివరించారు.

రైతులకు సూచనలు :

ఒకే పంట సాగు చేయడం వల్ల భూసారం తగ్గి
పంట చీడపీడలు పెరిగి దిగుబడులు తగ్గుతున్నాయని తెలిపారు. పంట మార్పిడి విధానం, సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటిస్తే
మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో ధూపహాడ్ సర్పంచ్ నన్నెపంగ కమలమ్మ – సైదులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డి. అదర్స్, పి. అక్షిత్ సాయి, కిరణ్,
లైలా వ్యవసాయ విద్యాసంస్థకు చెందిన విద్యార్థినిలు సాత్విక, వంశిక, రుత్విక, నవ్య, అశ్విని, ఫరీనా మరియు రైతు సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు.

MOST READ NEWS 

  1. SBI : ఎస్బిఐ కస్టమర్లకు రూ.2 లక్షలు ఇస్తుంది.. ఎందుకో తెలుసా..!

  2. TG News : కొత్త సర్పంచుల ఉత్సాహం.. పల్లెల్లో అభివృద్ధికి బాటలు, కానీ అప్పుడే ఎదురుచూపులు..! 

  3. Yadadri : యాదాద్రి జిల్లాలో నిండు గర్భిణీ పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం..!

మరిన్ని వార్తలు