Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsకరీంనగర్తెలంగాణ

అందమైన ఫోటోలతో ఆకర్షించి హానీ ట్రాప్.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, కిలాడీ భార్యాభర్తల అరెస్ట్..!

సోషల్ మీడియా వేదికగా అమాయకులను, వ్యాపారవేత్తలను ఆకర్షించి, వారితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రికార్డు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కిలాడీ దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అందమైన ఫోటోలతో ఆకర్షించి హానీ ట్రాప్.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, కిలాడీ భార్యాభర్తల అరెస్ట్..!

​కరీంనగర్, మనసాక్షి :

సోషల్ మీడియా వేదికగా అమాయకులను, వ్యాపారవేత్తలను ఆకర్షించి, వారితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రికార్డు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కిలాడీ దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు గత కొంతకాలంగా కరీంనగర్ రూరల్ పరిధిలోని ఆరేపల్లి శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణీయమైన ఫోటోలు పెడుతూ యువకులను, వ్యాపారస్తులను ప్రలోభపెట్టేది. ఆమెను సంప్రదించిన వారితో డబ్బులు మాట్లాడుకుని తన నివాసానికి పిలిపించుకునేది.

వారు ఏకాంతంగా ఉన్న సమయంలో, భర్త రహస్యంగా మొబైల్ ఫోన్లలో నగ్న వీడియోలను చిత్రీకరించేవాడు. ఈ వీడియోలను చూపిస్తూ బాధితులను భయపెట్టి సదరు దంపతులు భారీగా డబ్బులు వసూలు చేసేవారు. ఈ అక్రమ సంపాదనతో వారు అపార్ట్మెంట్ ఈఎంఐలు కట్టడమే కాకుండా, టాటా కారును కొనుగోలు చేశారు. తమ ఇంట్లో ఖరీదైన సోఫా సెట్లు, ఏసీలు ఏర్పాటు చేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఇప్పటివరకు సుమారు 100 మందిని వీరు ట్రాప్ చేసినట్లు సమాచారం. ​వెలుగులోకి తెచ్చిన బాధితుడు కరీంనగర్ కు చెందిన ఒక వ్యక్తి గత ఏడాది కాలంగా వీరి వద్దకు వెళ్తున్నాడు. అతని వద్ద నుండి ఇప్పటికే సుమారు 14 లక్షల రూపాయలను వసూలు చేసిన దంపతులు, అదనంగా మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే వీడియోలు వైరల్ చేసి చంపేస్తామని బెదిరించారు.

ప్రాణభయంతో సదరు బాధితుడు మంగళవారం కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాలతో సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు బృందాలు గాలింపు చర్యలు చేపట్టి బుధవారం టేస్టీ దాబా వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వారి నుండి నేరానికి ఉపయోగించిన కారు ​నగ్న వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్లు బాధితుడి నుండి తీసుకున్న చెక్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై ​నిందితులను విచారించగా వారు చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తుల ట్రాప్ లో పడకూడదని, ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు పోలీసులు కోరారు.

MOST READ NEWS 

  1. TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఇకపై వారిని పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. డిండి ఎత్తిపోతల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..!

  3. TG News : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో నూతన పథకం ప్రారంభం..!

  4. Nalgonda : బెట్టింగులకు అలవాటు పడి.. చివరికి అలా మారాడు..!

మరిన్ని వార్తలు