Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : డాబాలలో పోలీసుల ఆకస్మిక దాడులు..!

దాబాల్లో మద్యం విక్రయించిన సేవించిన కఠిన చర్యలు తప్పవని నారాయణపేట టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు.

Narayanpet : డాబాలలో పోలీసుల ఆకస్మిక దాడులు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి:

దాబాల్లో మద్యం విక్రయించిన సేవించిన కఠిన చర్యలు తప్పవని నారాయణపేట టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని పలు దాబాలలో అక్రమంగా మద్యం విక్రయించడం, మద్యం సేవిం చేందుకు అక్రమ సిట్టింగ్లు నిర్వహించడం జరిగితే దాబా యజమానుల పై చట్టపర మైన కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గురువారం సాయంత్రం ఆకస్మికంగా పలు దాబాలను తనిఖీ నిర్వహిం చామని, దాబాలలో మద్యం విక్రయించడం గానీ, మద్యం సేవించేందుకు సిట్టింగ్లు ఏర్పా టు చేయడం గానీ చట్టవిరు ద్ధమని తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, దాబా యజమానులు చట్టాలను కచ్చితంగా పాటించాలని, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరిం చారు.ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Suryapet : సూర్యాపేట పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ఎట్ డోర్ స్టెప్ నూతన కార్యక్రమం.. బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరణ..!

  2. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  3. Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు