Tragedy : తీవ్ర విషాదం.. పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్య..!
పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తీవ్ర విషాదం ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నది. ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో జీయ్యమ్మ మండలం వనజ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Tragedy : తీవ్ర విషాదం.. పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్య..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తీవ్ర విషాదం ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నది.
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో జీయ్యమ్మ మండలం వనజ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
అదే గ్రామానికి చెందిన మధు, సత్యవతి దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారికి ఏం కష్టం వచ్చిందో.. ఏమో తెలియదు. కానీ గత రాత్రి ఆ కుటుంబ సభ్యులంతా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఆ ఇంటి నుంచి ఎవరూ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా మధు కుటుంబ సభ్యులు మృతి చెంది ఉన్నారు. ఈ ఘటనలో మీనక మధు (35) అతని భార్య సత్యవతి (30) వారి కుమారుడు మోష (4) మృతిచెందగా కుమార్తె అయోష పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడానికి ఆర్థిక ఇబ్బందుల కారణమా..? లేక ఇతర కారణాలా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









