Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

SURYAPET : సూర్యాపేట మున్సిపల్ ఓటర్ల జాబితాపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు..!

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో కుల రిజర్వేషన్, వార్డు వారీ కేటాయింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించలేదని ఆరోపిస్తూ సూర్యాపేటకు చెందిన డి. శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు.

SURYAPET : సూర్యాపేట మున్సిపల్ ఓటర్ల జాబితాపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో కుల రిజర్వేషన్, వార్డు వారీ కేటాయింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించలేదని ఆరోపిస్తూ సూర్యాపేటకు చెందిన డి. శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.పిటిషనర్ తరఫున న్యాయవాది ఆర్. శ్రీధర్ వాదనలు వినిపించగా, ప్రభుత్వం, ఎన్నికల సంఘం, మున్సిపల్ అధికారుల తరఫున సంబంధిత న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ, పిటిషనర్ 19-01-2026న ఇచ్చిన అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని ఆదేశించింది.

కుల రిజర్వేషన్, వార్డు వారీ రిజర్వేషన్ కేటాయింపుల్లో ఉన్న లోపాలపై పిటిషనర్‌కు వాదించే అవకాశం కల్పించి, చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌కు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా, అత్యవసరంగా పూర్తి చేయాలని, ముఖ్యంగా ఆదేశాల ప్రతిని స్వీకరించిన తేదీ నుంచి ఏడు రోజుల్లోపు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఫిబ్రవరి 20, 2026న మళ్లీ విచారణకు లిస్టు చేసింది.

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ ఆదేశాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తుది ఓటర్ల జాబితా, కుల రిజర్వేషన్ అంశాలపై కలెక్టర్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ పరిణామాలతో సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై తాత్కాలిక ఉత్కంఠ నెలకొంది.

By : Rangu Muthyam Raju, Suryapet

MOST READ :  

  1. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

  2. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Suryapet : సూర్యాపేట పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ఎట్ డోర్ స్టెప్ నూతన కార్యక్రమం.. బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరణ..!

  4. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు