Hyderabad : హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్ వేర్ద్ ఉద్యోగిని..!
హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ లో దూకి సాఫ్టువేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Hyderabad : హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్ వేర్ద్ ఉద్యోగిని..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ లో దూకి సాఫ్టువేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. కూకట్పల్లి పరిధిలో ని మైత్రి నగర్ లో తన తల్లితో నివాసం ఉంటూ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది విజయలక్ష్మి. తల్లికి మతి స్థిమితం సరిగా లేదు. కాగా ఇటీవల ఆమెకు వివాహ సంబంధాలు రావడంతో మతిస్థిమితం లేని తన తల్లి తనతో పాటే ఉంటుందని విజయలక్ష్మి నిబంధన పెట్టింది. దాంతో పెళ్లికి నిరాకరణ జరిగింది.
ఈ విషయంపై ఆమె మనో వేదనకు గురై శనివారం సాయంత్రం ఇంట్లో నుండి బయటకు వెళ్లి ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్ లో శవమై తేలింది. ఆమె స్వగ్రామం మేడ్చల్ జిల్లా కండ్లకోయ కు చెందిన యువతీగా గుర్తించారు. తనకు వివాహం అయితే తన తల్లిని చూసుకునేవారు లేరని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఐటీ సంస్థలో ఆమెకు నెలకు లక్ష రూపాయల వేతనం ఉన్నట్లు సమాచారం.
MOST READ
-
తెలుగు రాష్ట్రాలను కంటతడి పెట్టిస్తున్న కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముంది..!
-
Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్, సీపీఎం పొత్తు.. 29వ వార్డులో డబ్బికార్ మల్లేష్ గెలుపుకు ప్రచారం..!
-
విద్యుత్ చీఫ్ ఇంజనీర్ కీలక ప్రకటన.. గ్రామాలలో విద్యుత్ అధికారుల పర్యటన..!
-
Gold Price : మళ్లీ వేలల్లో పడిపోయిన పసిడి.. భారీగా దిగివచ్చిన ధర..!









