నల్గొండBreaking Newsజిల్లా వార్తలుపండుగలు

వైభవంగా పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం..!

కోరిన కోరికలు తీర్చే దైవంగా కొంగు బంగారమై లోకమంతా కాపురం ఉండే పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొలుకుల పల్లి గ్రామంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగ స్థానిక సర్పంచ్ బట్టు అనురాధ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.

వైభవంగా పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం..!

చింతపల్లి, మన సాక్షి :

కోరిన కోరికలు తీర్చే దైవంగా కొంగు బంగారమై లోకమంతా కాపురం ఉండే పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొలుకుల పల్లి గ్రామంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగ స్థానిక సర్పంచ్ బట్టు అనురాధ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తుల నడుమ వేద పండితులు వల్లించిన మంత్రోచ్ఛరనల తో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్త బృందం ఆలపించిన భక్తి పాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి సర్పంచ్ అనురాధ కిషన్ రెడ్డి మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత నెలకొంటుందని వారు పేర్కొన్నారు. మన గ్రామంలోని దేవాలయ ఆవరణలో నిర్వహించే స్వామివారి కల్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం కోసమని వారు పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం ఇదేవిధంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై పార్వతీ పరమేశ్వర ల ఆశీస్సులు పొందుదామన్నారు. దైవ భక్తితో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల ను ముందుకు తీసుకు వెళ్దాం అన్నారు. దైవ కార్యాలతో పాటు మన గ్రామ అభివృద్ధికి కూడా అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్దామని పేర్కొన్నారు.

అనంతరం సోమవారం గ్రామ ప్రజలకు, భక్తులకు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలోగ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, వేద పండితులు, ఆలయ పూజారి మట్ట యాదయ్య గురుస్వామి, డాక్టర్ పొట్ట బత్తుల విజయ్ కుమార్, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక.. వీడిన సస్పెన్స్..!

  2. Karimnagar : కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఖరారు.. ఉత్కంఠతకు తెర..!

  3. CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)

  4. Narayanpet : పేట మున్సిపల్ చైర్ పర్సన్ బిజెపి కైవసం..!

మరిన్ని వార్తలు