Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

బీఆర్ఎస్ లో గెలిచి.. బిజెపి మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్..!

తెలంగాణలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్ గా గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరి చైర్మన్ సీటు దక్కించుకున్నారు.  అతనికి బిజెపి మద్దతు ఇచ్చింది.

బీఆర్ఎస్ లో గెలిచి.. బిజెపి మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్..!

ఆమనగల్లులో ఒక్కటైన బిజెపి, కాంగ్రెస్..!

చైర్మన్ సీటు కైవసం చేసుకున్న హస్తం

ఆమనగల్లు, మన సాక్షి:

తెలంగాణలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్ గా గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరి చైర్మన్ సీటు దక్కించుకున్నారు.  అతనికి బిజెపి మద్దతు ఇచ్చింది.

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఒకటయ్యాయి. బీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు ఉన్నప్పటికీ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు బిజెపి, కాంగ్రెస్ ఒకటయ్యాయి.

బిఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ ఎనిమిది స్థానాలను గెలుచుకొని చైర్మన్ పదవికి పాపిశెట్టి రాము పేరును గులాబీ పార్టీ ప్రతిపాదించింది. రాజకీయ సమీకరణలు బిజెపి అధికార కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టి బిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి 6వ వార్డులో గెలుపొందిన పత్య నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకుని చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి చైర్మన్ గా గెలుపొందారు. వైస్ చైర్మన్ గా తల్లోజు గీత ఎన్నికయ్యారు దీంతో ఉదయం కారులో ఉన్న పత్య నాయక్ కాంగ్రెస్ కు జంప్ అయ్యి చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో అందరూ అతన్ని అదృష్ట జాతకుడిగా అభివర్ణిస్తున్నారు.

మరిన్ని వార్తలు