Miryalaguda : మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులకు ఘనంగా సన్మానం..!
మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన చిలుకూరి సుధా బాలకృష్ణ దంపతులను బుదవారం 25 వ వార్డు ఇంచార్జ్ గోదాల జానకి రామ్ రెడ్డి, బీసీ యువ నాయకులు నేరెళ్ల యశ్వంత్, ముత్తినేని శంకర్ ఆధ్వర్యంలో మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని సన్మానించారు.

Miryalaguda : మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులకు ఘనంగా సన్మానం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన చిలుకూరి సుధా బాలకృష్ణ దంపతులను బుదవారం 25 వ వార్డు ఇంచార్జ్ గోదాల జానకి రామ్ రెడ్డి, బీసీ యువ నాయకులు నేరెళ్ల యశ్వంత్, ముత్తినేని శంకర్ ఆధ్వర్యంలో మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని సన్మానించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 25 వార్డ్ ఇంచార్జ్ గోదాల జానకి రామ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జనరల్ స్థానంలో ఒక బీసీ ఆడపడుచుకు చైర్మన్ పదవి కేటాయించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని అన్నారు.
ఎన్ని సమస్యలు ఒత్తిళ్లు వచ్చినా బీసీలకు న్యాయం చేసినటువంటి ఎమ్మెల్యే బిఎల్ఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ.. అలాగే మన మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ చిలుకూరి సుధా ఆధ్వర్యంలో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డుకు చెందిన మహిళలు రాధ, కవిత , వెంకటలక్ష్మి, విజయ, జుమాని, సునీత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.