Nalgonda : మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు.. జూనియర్ కళాశాల వార్షికోత్సవం లోనే ఆర్డర్స్..!
విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు గా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్డు భవనాల &. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ్యాపకులకు సూచించారు.

Nalgonda : మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు.. జూనియర్ కళాశాల వార్షికోత్సవం లోనే ఆర్డర్స్..!
నల్లగొండ, మన సాక్షి :
విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు గా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్డు భవనాల &. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ్యాపకులకు సూచించారు. అవసరమైతే ప్రతిరోజూ అదనంగా రెండు గంటలు ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లండని అన్నారు.
బుధవారం నల్లగొండ కేంద్రంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్యసాధనకు ఆలోచించాలన్నారు.
ఇంటర్మీడియట్ జీవితంలో టర్నింగ్ పాయింటని, ఈ దశలోనే భవిష్యత్ నిర్ణయమవుతుందని చెప్పారు.
విద్యార్థినులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదివితే తప్పకుండా విజయం సాధించగలరన్నారు. భవిష్యత్ లో I (కృత్రిమ మేధస్సు) రంగంలో కూడా అవకాశాలు విస్తృతంగా ఉంటాయని, ఆ దిశగా ఆలోచించాలని చెప్పారు. బాగా చదివి తల్లిదండ్రులకు, గురువులకు, స్వంత ఊరికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఎంత మంది విద్యార్థినులు డాక్టర్లు కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారో, అంతమందిని చదివించేందుకు తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఐ ఏ స్ డాక్టర్, ఇంజనీర్ కావాలనే లక్ష్యాల కోసం నాప్పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థినులందరికీ ఎంసెట్ కోచింగ్ మెటీరియల్ సదుపాయం ఇస్తామని తెలిపారు.
ప్రతిరోజు రెండు గంటలు అదనపు తరగతులు నిర్వహించాలని అధ్యాపకులను ఆదేశించారు.
విద్యార్థులు ప్రతిరోజు 10 గంటలుకష్టపడి చదువుకోవాలని విద్యార్థులు లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో చదవాలి. కళాశాలకు నూతన భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ఆదివారం లోపు పాత బిల్డింగ్ ను కూల్చి నూతన బిల్డింగులకు కట్టడానికి ప్లాన్ చేయండని కమిషనర్ కు చెప్పారు.
తిప్పర్తి ,కనగల్లు మండలంలో ఇప్పటికే జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ లు మాట్లాడారు.
ఆర్డీవో వై అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అశ్రప్ అమిర్ అలీ. కళాశాల ప్రిన్సిపల్ ఎం పద్మ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ కు ఘన సన్మానం..!
Miryalaguda : జేఈఈ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థుల ప్రభంజనం..!
Madanapalle : ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య.. ఆగ్రహంతో ఊగిపోతున్న మదనపల్లె..!











