Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డి

Shankarpally : మాస్కులు ధరించి.. కత్తులతో బెదిరించి..!

మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు చోరీ అయిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..

Shankarpally : మాస్కులు ధరించి.. కత్తులతో బెదిరించి..!

శంకర్‌పల్లి, (మన సాక్షి) :

మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు చోరీ అయిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి పట్టణ శివారులో మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఒక ఓపెన్ లేఔట్ లో ఒంటరిగా ఉన్న జంటని కత్తులు చూపించి బెదిరించి మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారపు చైను స్నాచింగ్ చేసిన సంఘటన జరిగింది.

శ్రీకాంత్ గౌడ్, అతని స్నేహితురాలు కలిసి ఇస్నాపూర్ నుంచి వికారాబాద్ వెళ్తున్న క్రమంలో శంకర్‌పల్లి పట్టణ శివారులోని ఓడిఎఫ్ రోడ్ లో గల ఓపెన్ లేఅవుట్ లో మూత్ర విసర్జన కోసం ఆగి ఉండగా అంతలోనే నలుగురు దుండగులు నంబర్ ప్లేట్ లేని రెండు ద్విచక్ర వాహనాలపై ముఖానికి మాస్కులు కట్టుకొని వచ్చి ఈ జంట దగ్గర కత్తులు చూపించి, బెదిరించి, మూడు తులాల బంగారు చైన్ స్నాచింగ్ చేసి పారిపోయారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డిఐ సమరం రెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణని వేగవంతం చేసినట్లు సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కేసు యొక్క దర్యాప్తుని ప్రత్యేకంగా చేవెళ్ల ఏసిపి కిషన్ గౌడ్ పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

  1. Nalgonda : మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు.. జూనియర్ కళాశాల వార్షికోత్సవం లోనే ఆర్డర్స్..!

  2. Miryalaguda : మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులకు ఘనంగా సన్మానం..!

  3. రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ..!

  4. TG News : పంచాయతీలకు గుడ్ న్యూస్.. ఆ నిధులు విడుదల..!

మరిన్ని వార్తలు