Nalgonda : రెండేళ్లలో నల్లగొండ స్మార్ట్ సిటీ, ఎలా ఉంటుందో చూపిస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
రానున్న రెండేళ్లలో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.బుధవారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్, 41 వ డివిజన్ లలో సుమారు కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్న పార్కుల పనులకు శంకుస్థాపన చేశారు.

Nalgonda : రెండేళ్లలో నల్లగొండ స్మార్ట్ సిటీ, ఎలా ఉంటుందో చూపిస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
నల్లగొండ,, మన సాక్షి :
రానున్న రెండేళ్లలో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.బుధవారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్, 41 వ డివిజన్ లలో సుమారు కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్న పార్కుల పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాలలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని పార్కులన్నీటిని మోడల్ పార్కులుగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్నట్లుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్, తాగునీటికి అత్యంత ప్రాధన్యత ఇవ్వడం జరుగుతుందని, పట్టణానికి 24 గంటలు మంచినీటి సరఫరా ఉండేలా లతీఫ్ షాబ్ గుట్ట వద్ద ఇదివరకే తాగునీటి సరఫరాకు శంకుస్థాపన చేయడం జరిగిందని , శానిటేషన్ విషయమైఇక పై పట్టణంలో ఆకస్మిఖ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, మేయర్, డిప్యూటీ మేయర్ తో సహా కార్పొరేటర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
లో వోల్టేజ్ సమస్యను తొలగించేందుకు పట్టణం చుట్టూ సబ్స్టేషన్ల నిర్మాణంతో పాటు, లైన్ల షిఫ్టింగు వంటివి చేపట్టామని ,900 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు జరుగుతున్నాయని, అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, బొట్టుగూడ మాదిరిగానే మరికొన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తామని, 20 కోట్ల రూపాయలతో చేపట్టిన న్యాక్ భవనం నిర్మాణంలో ఉందని, 84 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని పూర్తి చేయడం జరిగిందని, ఎస్ఎల్ బిసీ సొరంగం లైనింగ్ పనులు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయని, బ్రాహ్మణ వెల్లేముల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని, లతీఫ్ షాబ్ గుట్ట ,బ్రహ్మంగారి గుట్టకు ఘాట్రోడ్ల నిర్మాణం ,ఔటర్ రింగ్ రోడ్డు, 8 సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, పట్టణాన్ని రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తామని, రాబోయే రెండు సంవత్సరాలలో స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందో చూపిస్తామని తెలిపారు.
అంతేకాక పారిశ్రామికంగా నల్గొండ ను అభివృద్ధి చేసి పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దామని, అన్ని కాలనీలలో పార్కులు, రోడ్లు, డ్రైనేజీ అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామని, సమస్యలను ప్రజలు సమస్యలను మేయర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇకపై నల్గొండ పట్టణం ప్రశాంతతకు మారుపేరుగా ఉండేలా రౌడీయిజం, గంజాయిజల పై ఉక్కు పాదం మోపుతామని , పేదవాడి అభివృద్హే లక్ష్యంగా పనిచేస్తామని, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలుతీసుకుంటామన్నారు.
ప్రభుత్వ విప్, శాసన సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. పార్కుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదంతో పాటు, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడం సంతోషమని, దీనిని ఆదర్శంగా తీసుకొని ఇతర మున్సిపాలిటీలో సైతం అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని ,అలాగే నల్గొండలో తాగునీరు, శానిటేషన్ ,డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణం బాగున్నాయని తెలిపారు.
కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణవాసులు సేదదీరేందుకు పార్కులుఉపయోగపడతాయని, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పార్కుల నిర్వహణలో భాగస్వాములు కావాలని, బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకొని ఉందని, నాణ్యమైన విద్య ,అహ్లాదకరమైన వాతావరణంలో అందించడంలో ప్రజలు సహకరించాలని కోరారు.
మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ హై జీన్ ముఖ్యమని, అందువలన ప్రజలు బయట ఎక్కడపడితే అక్కడ చెత్తవేయవద్దని ,వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, నల్గొండలో ఉష్ణోగ్రతల ను దృష్టిలో ఉంచుకుని ఎండ వేడిని తగ్గించేందుకు పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, నల్గొండను రాష్ట్రంలోనే ఉన్నత కార్పొరేషన్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో పార్కుల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా, ప్లేగ్రౌండ్ ఆట వస్తువులు, సుందరీ కరణ, పార్కులకు వచ్చిన వారు సేద తీరేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, చెత్త రహిత కార్పొరేషన్ గా నల్గొండ ను అభివృద్ధి చేయాలన్నదే మంత్రి ఉద్దేశమని, దీనికి అందరూ సహకరించాలని కోరారు.
డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ మహమ్మద్, కార్పొరేటర్లు వేదశ్రీ, సాయి ,కేసాని వేణుగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు.
జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ పరశురాం, తదితరులు ఉన్నారు.










