Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : గ్రామ పంచాయతీలకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆర్థిక సంఘం నిధులు విడుదల..!

గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులలో 3వ విడత నిధులను విడుదల చేసింది.

TG News : గ్రామ పంచాయతీలకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆర్థిక సంఘం నిధులు విడుదల..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులలో 3వ విడత నిధులను విడుదల చేసింది. అందులో భాగంగా 3వ విడతలో 387.53 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

మొదటి విడతలో రూ. 259.36 కోట్లు విడుదల చేయగా, రెండవ విడతలో రూ. 387 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం తాజాగా మూడో విడత నిధులను విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు మూడు విడతలుగా 1034.42 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం నుంచి దశలవారీగా విడుదలైన ఈ నిధుల నుంచి తెలంగాణ ఆర్థిక శాఖ గత మంగళవారం గ్రామపంచాయతీలకు రూ.256 కోట్ల విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రెండేళ్ల పాటు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి.

పెండింగ్ లో రూ.2000 కోట్లు :

2025 డిసెంబరులో తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. కాగా తెలంగాణకు కేంద్రం ఇంకా 2000 కోట్ల రూపాయలు బాకీ ఉంది.

గ్రామ అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు, పెండింగ్ బిల్లుల కోసం చెల్లింపులకు వెచ్చించాలని ఆమె ఆదేశించారు.

ఇవీ చదవండి : 

మరిన్ని వార్తలు