Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Nalgonda : నల్గొండ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!

పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని, కొత్తగా తీసుకొచ్చిన యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో రైతులు శనివారం ధర్నా నిర్వహించారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!

వేములపల్లి, మన సాక్షి :

పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని, కొత్తగా తీసుకొచ్చిన యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. కోపరేటివ్ సొసైటీ ముందు నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై వేములపల్లి మండల పరిధిలోని గ్రామాల రైతులు రోడ్డుపై బైటయించారు.

యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసేందుకు తమ వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో యూరియా సరాపర చేయడం లేదని విమర్శించారు. ఏవో కిషోర్ నాయక్ , ఏఈఓ నితిన్, ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పారు.

ఇవీ చదవండి

  1. ACB : భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారుల దాడులు..!
  2. Artificial Intelligence : ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటుకు తెలంగాణ సిద్ధం..!
  3. Miryalaguda : అప్రమత్తంగా ఉండి యూరియా బుక్ చేసుకోవాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!
  4. సూర్యాపేటలో ఫిబ్రవరి 21న రెడ్ బుక్ డే.. అమెరికా సామ్రాజ్యవాదంపై చర్చ..!

మరిన్ని వార్తలు