Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలు

మరో జాన్ పహాడ్ దర్గా గా పీకే మల్లేపల్లి హజరత్ అబ్బాస్ దర్గా..!

మతసామరస్యానికి ప్రతీకగా చింతపల్లి మండలం పరిధిలోని హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా పీకే మల్లేపల్లి గ్రామంలో గత 60 సంవత్సరాల అర్థం నెలకొల్ప బడిన ఈ దర్గా దేవరకొండ నియోజకవర్గం ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందుతుంది.

మరో జాన్ పహాడ్ దర్గా గా పీకే మల్లేపల్లి హజరత్ అబ్బాస్ దర్గా..!

చింతపల్లి, మనసాక్షి :

మతసామరస్యానికి ప్రతీకగా చింతపల్లి మండలం పరిధిలోని హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా పీకే మల్లేపల్లి గ్రామంలో గత 60 సంవత్సరాల అర్థం నెలకొల్ప బడిన ఈ దర్గా దేవరకొండ నియోజకవర్గం ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందుతుంది. నేటి నుండి దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఈ ఉరుసు ఉత్సవాలు, ప్రతి ఏటా జరుపుకునే విధంగాఈ సంవత్సరం కూడా ఉత్సవాలు జరుపుకునేందుకు దర్గా కమిటీ సన్నద్ధమైంది. ఈరోజు రాత్రి హైదరాబాదు నుండి తీసుకొచ్చిన గంధం గ్రామంలో పురవీధుల గుండా ఒంటిపై ఊరేగిస్తూ తెల్లవారుజామున దర్గాకు చేర్చనున్నారు.

అదేవిధంగా సమీపంలో పైన మక్కా మహేశ్వర స్వామి( శివాలయంలో) శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఆదివారం జరపనున్నారు. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం దాతలు సహకారంతో నిర్వహించడం జరుగుతుందని దర్గా ముత్తవల్లి చాంద్ పాషా పేర్కొన్నారు.

ఈ ఉత్సవ కార్యక్రమాలకుదేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, జిల్లా ముఖ్య నాయకులు, చింతపల్లి మండల వివిధ పార్టీల నాయకులు వివిధ శాఖల అధికారులు, మండలంలోని పలు గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు జెడ్పిటిసిలు దేవరకొండ డిఎస్పి నాంపల్లి సిఐ, చింతపల్లి ఎస్సై వీరితో పాటు పలువురు ప్రముఖులు రానున్నారు.

దర్గా దర్శనానికి ప్రముఖుల రాక సందర్భంగా చింతపల్లి ఎస్ ఐ దర్గా పరిసర ప్రాంతాలను పరిశీలించి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవ కార్యక్రమాలను తిలకించేందుకు విచ్చేసిన భక్తులకు దర్గా వద్ద సకల సౌకర్యాలు సమకూర్చినట్లు దర్గా నిర్వాహకులు చాంద్ పాషా పేర్కొన్నారు. వేలాదిగా తరలివచ్చి మొక్కలు చెల్లించుకోవాలని వారు భక్తులను కోరారు.

By : Puppala Venkateshwarlu

MOST READ 

మరిన్ని వార్తలు