Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

TG : తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి వ్యవస్థ ఎత్తివేసేందుకు యత్నం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ..!

తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పిటిసి వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాచారం. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతోంది. ఈ వ్యవస్థల వల్ల పెద్దగా ఉపయోగం లేదని, వారికి అధికారాలు, బాధ్యతలు కూడా సరైనవి లేవని అందుకే ఈ వ్యవస్థలను ఎత్తివేసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

TG : తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి వ్యవస్థ ఎత్తివేసేందుకు యత్నం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పిటిసి వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాచారం. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతోంది. ఈ వ్యవస్థల వల్ల పెద్దగా ఉపయోగం లేదని, వారికి అధికారాలు, బాధ్యతలు కూడా సరైనవి లేవని అందుకే ఈ వ్యవస్థలను ఎత్తివేసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ విషయంపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ విధానాన్ని ఎత్తివేస్తే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ ను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలలో ఏ విధానం అమలు చేస్తున్నారనే విషయంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవస్థలను రద్దు చేయడానికి చట్టపరంగా, రాజకీయపరంగా ఏం చేయాలనే విషయంపై పూర్తి వివరాలను సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ : Nalgonda : నల్గొండ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!

ఎంపీటీసీల స్థానంలో సర్పంచులు ఎంపీపీని ఎన్నుకుంటారు. జడ్పిటిసిల స్థానంలో ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. కొత్తగా ఈ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ విధానం తీసుకొస్తే ఎప్పటినుంచో సర్పంచుల నుంచి డిమాండ్ ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించాలని విషయం కూడా స్పష్టం అయ్యే అవకాశం ఉంది. ఎంపిటిసిల స్థానంలో సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించనున్నారు.

1993 లో దేశవ్యాప్తంగా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టబద్ధమైంది. (గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్) 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని అమలు చేస్తున్నారు. అయితే ఈ వ్యవస్థను తొలగించాలంటే పార్లమెంటులో రెండింట మూడో వంతు మెజారిటీతో పాటు కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం జనాభాలో 20 లక్షల కంటే ఎక్కువ ఉన్న ప్రతి రాష్ట్రంలో కచ్చితంగా మూడంచెల వ్యవస్థ ఉండాలి.

ALSO READ : BREAKING : సూర్యాపేటలో ప్రేమోన్మాది ప్రియురాలు పై సుత్తితో దాడి.. స్థానికులు దేహశుద్ధి..!

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవస్థను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందితేనే సాధ్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కేంద్రం ఆమోదం లేకుంటే కచ్చితంగా ఎంపిటిసి, జడ్పిటిసి లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మద్దతు ఉంటుందా..? జడ్పిటిసి, ఎంపిటిసి వ్యవస్థలను తొలగిస్తారా..? అనే విషయాన్ని మరి కొద్ది రోజులు వేచి చూద్దాం.. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

MOST READ : 

మరిన్ని వార్తలు